
ఆన్‌లైన్‌లో పియాజియో యాక్సెసరీలు
అమెజాన్ ఇండియాతో ఒప్పందం
న్యూఢిల్లీ: పియాజియోకు చెందిన అప్రిలియా, వెస్పా బ్రాండ్ స్కూటర్లు ఇక నుంచి ఆన్‌లైన్‌లో కూడా లభ్యమవుతాయి. ఈ మేరకు పియోజియో కంపె నీ అమెజాన్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది. ఇందులోలో భాగంగా అప్రిలియా, వెస్పా బ్రాండ్ల షర్ట్‌లు, టీ–షర్ట్‌లు, జాకెట్స్, ఐపాడ్ స్లీవ్స్, ఫోన్ బ్యాక్ కవర్స్, హెల్మెట్స్ అమెజాన్ ఇండియా నుంచి వినియోగదారులు కొనుగోలు చేయవచ్చని పియాజియో వెహికల్స్ ఎండీ, సీఈఓ స్టెఫానో పేర్కొన్నారు.
అమెజాన్‌డాట్‌ఇన్‌లో ఆటోమోటివ్ కేటగిరీ వస్తువుల విభాగం వేగంగా వృద్ధి చెందుతోందని అమెజాన్ ఇండియా ఆటోమోటివ్ కేటగిరీ లీడర్‌సుచిత్ సుభాశ్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ కేటగిరిలో మరిన్ని ఉత్తమమైన వస్తువులను వినియోగదారులకు అందించడానికి మరిన్ని ఒప్పందాలను కుదుర్చుకుంటామని తెలియజేశారు.