నల్లగొండ, మిర్యాలగూడ : నాలుగు రోజుల క్రితం కోసిన మటన్‌ను పాత వ్యవసాయ మార్కెట్‌లో విక్రయించేందుకు స్కూటర్ డిక్కీలో తీసుకొస్తున్న వ్యాపారిని ఆదివారం పట్టుకున్నారు. ఈ విషయాన్ని మార్కెట్ కార్యదర్శి శ్రీధర్, చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆ వ్యాపారికి మూడు వేల రూపాయల జరిమానా విధించారు. మటన్ మార్కెట్‌లో మరో 16 పొట్టేళ్లను పశువైద్యాధికారులు రిజెక్ట్ చేశారు. మరోవైపు భౌతిక దూరం పాటించకుండానే వినియోగదారులు మాంసం కొనుగోలు చేశారు. మాంసం మార్కెట్‌ను మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. నాణ్యమైన మాంసం విక్రయించాలని వ్యాపారులకు సూచించారు. ఆయన వెంట మార్కెట్ కార్యదర్శి శ్రీధర్, సూపర్‌వైజర్ సైదులు, సిబ్బంది పురం రవి, రమేశ్, సైదులు, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment