![Suzuki Access 125 BS6 Launched in India, at Rs 64800 - Sakshi](/styles/webp/s3/article_images/2020/01/7/suzuki2.jpg.webp?itok=X8BFZjJR)
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా (ఎస్‌ఎంఐపీఎల్).. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న యాక్సెస్ 125 స్కూటర్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ అధునాతన మోడల్.. అల్లాయ్ డ్రమ్ బ్రేక్, అల్లాయ్ డిస్క్ బ్రేక్, స్టీల్ డ్రమ్ బ్రేక్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 64,800 (ఎక్స్‌షోరూం–ఢిల్లీ) వద్ద నిర్ణయించింది. స్పెషల్ ఎడిషన్ ధర రూ. 69,500గా కంపెనీ ప్రకటించింది.
ఈ సందర్భంగా సంస్థ ఎండీ కొయిచిరో హిరావ్ మాట్లాడుతూ.. ‘ఎస్ ఎంఐపీఎల్ వృద్ధి బాటలో ఈ స్కూటర్ పాత్ర కీలకంగా కొనసాగుతోంది. నూతన ఆవిష్కరణతో కస్టమర్ల అంచనాలను అందుకోగలమని భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించా రు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన నిబంధనలు అమలుకానుండగా.. గడువు కంటే ముం దుగానే తాజా ఫ్యామిలీ స్కూటర్‌ను విడుదల చేయగలిగామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment