Suzuki Access
-
సుజుకీ యాక్సెస్ 125 రికార్డు
ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా సరికొత్త రికార్డు సాధించింది. సుజుకీ యాక్సెస్ 125 మోడల్లో కంపెనీ 60 లక్షల స్కూటర్ల తయారీ మార్కును దాటింది. ఈ ఘనతను సాధించడానికి సంస్థకు 18 ఏళ్లు పట్టింది. సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడు అవుతున్న మోడల్ కూడా ఇదే. దీర్ఘకాలిక మన్నిక, మెరుగైన పనితీరు, మైలేజీ, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉండడంతో యాక్సెస్ 125 స్కూటర్‌కు కస్టమర్ల నుంచి దేశ విదేశాల్లో మంచి స్పందన ఉంది. భారత్‌తోపాటు అంతర్జాతీయంగా కస్టమర్ల నమ్మకానికి ఈ గణాంకాలే నిదర్శనమని కంపెనీ ఎండీ కెనిచి ఉమేద తెలిపారు. యాక్సెస్ 125 తొలిసారిగా భారత్‌లో 2006లో అడుగుపెట్టింది. భారత రోడ్లపై 125 సీసీ ఇంజన్ సామర్థ్యంతో పరుగెత్తిన తొలి స్కూటర్ కూడా ఇదే కావడం విశేషం.మూడవ స్థానంలో కంపెనీ..దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య వివిధ కంపెనీలకు చెందిన 47,87,080 స్కూటర్లు రోడ్డెక్కాయి. ఇందులో సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా 14 శాతం వాటాతో మూడవ స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే 2024 ఏప్రిల్–నవంబర్‌లో కంపెనీ 18 శాతం దూసుకెళ్లి 6,84,898 యూనిట్ల స్కూటర్ల అమ్మకాలను సాధించింది. సుజుకీ ఎకో పెర్ఫార్మెన్స్ టెక్నాలజీతో 125 సీసీ ఎయిర్‌కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో ఇది రూపుదిద్దుకుంది. 5,500 ఆర్పీఎం వద్ద 10 ఎన్ఎం గరిష్ట టార్క్ అందిస్తుంది. బ్లూటూత్ ఆధారిత డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏర్పాటు చేశారు. కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్ అలర్ట్స్, మిస్డ్ కాల్ అలర్ట్స్ అందుకోవచ్చు. స్పీడ్ వార్నింగ్, ఫోన్ బ్యాటరీ లెవెల్ డిస్ప్లే, గమ్యస్థానానికి చేరుకునే సమయం వంటివి తెలుసుకోవచ్చు. 22.3 లీటర్ల స్టోరేజ్, ఈజీ స్టార్ట్ కీ సిస్టమ్, పొడవైన సీటు వంటివి అదనపు హంగులు. -
సుజుకీ స్కూటర్ ఓనర్లకు అలర్ట్.. 4 లక్షల వాహనాలు రీకాల్!
ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రై. లిమిటెడ్ భారత్‌లో దాదాపు నాలుగు లక్షల ద్విచక్ర వాహనాలకు రీకాల్ జారీ చేసింది. వీటిలో సుజుకీ యాక్సెస్ 125, అవెనిస్ 125, బర్గ్మాన్ స్ట్రీట్ మోడల్ వాహనాలు ఉన్నాయి.సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం యాక్సెస్ 125 అత్యధికంగా 2,63,788 యూనిట్లు, అవెనిస్ 125 మోడల్ 1,52,578 యూనిట్లు, బర్గ్మాన్ స్ట్రీట్ వాహనాలు 72,045 యూనిట్లను ఇగ్నిషన్ కాయిల్‌లోని హై-టెన్షన్ వైర్ లోపం కారణంగా కంపెనీ రీకాల్ చేసింది. ఈ వాహనాలు 2022 ఏప్రిల్ 30 నుంచి 2022 డిసెంబర్ 3 మధ్య కాలంలో తయారయ్యాయి. ఆయా మోడల్ స్కూటర్లు కొనుగోలు చేసినవారిని సంప్రదించే పనిలో కంపెనీ ఉంది. సమీపంలోని సర్వీస్ సెంటర్లో లోపభూయిష్ట భాగాన్ని కంపెనీ ఉచితంగా రీప్లేస్ చేసిస్తుంది.సమస్య ఇదే..వెబ్సైట్లో పేర్కొన్న దాని ప్రకారం.. డ్రాయింగ్ అవసరాలకు సరిపోని హై టెన్షన్ వైర్‌ను ఇగ్నిషన్ కాయిల్‌కు అమర్చడం వల్ల రన్నింగ్ సమయంలో వైర్ కోతలు పడటం, తెగిపోవడం జరుగుతోంది. దీంతో ఇంజన్ ఆగిపోవడం, స్టార్ట్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కోతలు పడిన హై టెన్షన్ వైర్ నీటితో తడిసినప్పుడు వాహనం స్పీడ్ సెన్సార్, థొరెటల్ పొజిషన్ సెన్సార్ లీక్ దెబ్బతినే అవకాశం ఉంది.కాగా సుజుకీ మోటర్‌సైకిల్ కంపెనీ మిడిల్ వెయిట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ వీ-స్ట్రోమ్ 800 డీఈ (V-Strom 800 DE)కి సంబంధించిన 67 యూనిట్లను కూడా రీకాల్ చేసింది. లోపభూయిష్టమైన వెనుక టైర్ దీనికి కారణంగా కంపెనీ చెబుతోంది. బైక్ వెనుక వెనుక టైర్‌పై పగుళ్లు వస్తున్నాయని, టైర్ ట్రెడ్ బయటకు వచ్చేస్తోందని, టైర్ రూపం దెబ్బతింటోందని కంపెనీ పేర్కొంది. ఆయా వాహనాల యజమానులకు సంప్రదిస్తున్నమని అవసరమైతే వెనుక టైర్ రీప్లేస్ చేస్తామని వివరించింది. ఈ వాహనాలు 2023 మే 5 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 23 మధ్య కాలంలో తయారయ్యాయి. -
ఆ బైక్ సేల్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకు 50 లక్షల యూనిట్ల యాక్సిస్–125 స్కూటర్లను ఉత్పత్తి చేసి ఈ ఘనతను సాధించింది. వినియోగదార్ల అభిరుచులకు అనుగుణంగా దాదాపు ఏటా ఈ మోడల్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. భారత్‌లో 2007లో యాక్సిస్–125 స్కూటర్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో దేశంలో 125 సీసీ విభాగంలో ఉన్న ఏకైక స్కూటర్ ఇదే. -
బీఎస్–6 సుజుకీ యాక్సెస్ వచ్చేసింది
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా (ఎస్ఎంఐపీఎల్).. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న యాక్సెస్ 125 స్కూటర్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ అధునాతన మోడల్.. అల్లాయ్ డ్రమ్ బ్రేక్, అల్లాయ్ డిస్క్ బ్రేక్, స్టీల్ డ్రమ్ బ్రేక్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 64,800 (ఎక్స్‌షోరూం–ఢిల్లీ) వద్ద నిర్ణయించింది. స్పెషల్ ఎడిషన్ ధర రూ. 69,500గా కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ కొయిచిరో హిరావ్ మాట్లాడుతూ.. ‘ఎస్ ఎంఐపీఎల్ వృద్ధి బాటలో ఈ స్కూటర్ పాత్ర కీలకంగా కొనసాగుతోంది. నూతన ఆవిష్కరణతో కస్టమర్ల అంచనాలను అందుకోగలమని భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించా రు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా నూతన నిబంధనలు అమలుకానుండగా.. గడువు కంటే ముం దుగానే తాజా ఫ్యామిలీ స్కూటర్‌ను విడుదల చేయగలిగామని అన్నారు.