
ఈ స్కూటర్ ధర రూ. 9 లక్షలకు విక్రయించింది. రానున్న రోజుల్లో మెకమ్ లాస్ వేగాస్ మోటార్ సైకిల్స్-2022 షోలో హార్లే-డేవిడ్సన్ స్కూటర్ టాపర్‌ను వేలం వేయాలని కంపెనీ భావిస్తోంది.
హార్లే-డేవిడ్సన్ ఈ పేరు వినగానే మనకు గుర్తువచ్చేవి ప్రీమియం లగ్జరీ మోటార్స్ బైక్స్. అమెరికాకు చెందిన హార్లే-డేవిడ్సన్ బైక్స్ మోడళ్ల ప్రారంభ ధరలు పది లక్షల నుంచి మొదలై 40 లక్షల వరకు ఉంటాయి. 1950లో హోండాకు పోటీగా హార్లే-డేవిడ్సన్ టాపర్ అనే స్కూటర్‌ను ఉత్పత్తి చేసింది. హార్లే-డేవిడ్సన్ బైక్ల స్థానంలో స్కూటర్లను ఉత్పత్తి చేస్తోందని ఎవరు ఊహించలేరు.
చదవండి: ఇప్పుడు ఫేవరెట్ టెస్లా కాదు..! ఇండియన్ కంపెనీ కోసం క్యూ!
హార్లే-డేవిడ్సన్ కేవలం ఐదు ఏళ్ల పాటు మాత్రమే ఈ స్కూటర్లను ఉత్పత్తి చేసింది. ఈ స్కూటర్ ధర రూ. 9 లక్షలకు విక్రయించింది. రానున్న రోజుల్లో మెకమ్ లాస్ వేగాస్ మోటార్ సైకిల్స్-2022 షోలో హార్లే-డేవిడ్సన్ స్కూటర్ టాపర్‌ను వేలం వేయాలని కంపెనీ భావిస్తోంది. హార్లీ డేవిడ్సన్ టాపర్ స్కూటర్లు అంతగా ఆదరణ లభించలేదు.
హార్లే-డేవిడ్సన్ టాపర్ మూడు మోడళ్లలో దేనిని వేలం వేస్తుందనే విషయంపై అస్పష్టంగా ఉంది. వేలం వచ్చే ఏడాది జనవరి 25 నుంచి జనవరి 29 వరకు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ రెట్రో స్కూటర్ వేలంపై ఇప్పటికే భారీ అంచనాలు నమోదవుతున్నాయి.
హార్లే-డేవిడ్సన్ టాపర్ స్కూటర్ ప్రత్యేకతుల ఇవే...!
హార్లే-డేవిడ్సన్ టాపర్ స్కూటర్‌లో సింగిల్ సిలిండర్, ఫ్లాట్-మౌంటెడ్ టూ-స్ట్రోక్ ఇంజిన్ ఏర్పాటుచేశారు. ఐదు నుంచి తొమ్మిది హార్స్‌పవర్ల పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ స్కూటర్ 20-అంగుళాల రియర్‌టైర్లను కలిగి ఉంది. ఈ స్కూటర్ సుమారు గంటకు 74 కిలోమీటర్ల గరిష్టవేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ఇంకో ప్రత్యేకత ఎంటంటే..దీనికి మరో సీట్ క్యాబిన్‌ను అమర్చుకోవచ్చును.
చదవండి: వీటిపై ఇన్వెస్ట్ చేస్తే లాభాలే..లాభాలు...!