బెంగళూరుకు చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ రివర్ తన 'ఇండీ' (Indie) ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ఎక్కువ స్టోరేజ్ స్పేస్, ఫ్రంట్ ఫుట్‌పెగ్‌లు, క్రాష్ గార్డ్ వంటి ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ.1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది, డెలివరీలు 2023 ఆగష్టులో ప్రారంభమవుతాయి.
రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ 4kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఒక ఛార్జ్‌పై 150 కి.మీ పరిధిని అందిస్తుంది, అయితే వివిధ వాతావరణ పరిస్థితుల్లో 120 రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ కేవలం 5 గంటలలో 0-80 శాతం ఛార్జ్ చేసుకోగలదు, ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
రివర్ ఇండీ బ్యాటరీ ప్యాక్ 8.98 బిహెచ్‌పి పవర్, 26 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 3.9 సెకన్లలో గంటకు 90 కిమీ వేగంతో ముందుకు వెళ్తుంది. ఇందులో ఎకో, రైడ్, రష్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక ట్విన్ హైడ్రాలిక్ షాక్ ఉన్నాయి.
ఈ లేటెస్ట్ స్కూటర్ ఒక ప్రత్యేకమైన డిజైన్ పొందుతుంది, కావున లో మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టైల్‌లైట్ వంటి వాటితో పాటు కాంట్రాస్ట్ డిస్‌ప్లే, ఛార్జింగ్ పోర్ట్ పొందుతుంది. ఇందులోని పన్నీర్ మౌంట్స్ లగేజ్ మోయడానికి సహాయపడతాయి.
రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అందిస్తుంది, కావున ఇందులో 12 లీటర్ల గ్లోవ్ బాక్స్, 43 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి. ఇది మాన్‌సూన్ బ్లూ, సమ్మర్ రెడ్, స్ప్రింగ్ ఎల్లో వంటి మూడు కలర్ ఆప్సన్స్‌లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ బ్యాటరీ, స్కూటర్ రెండింటికీ 5 సంవత్సరాల/50,000 కిమీ వారంటీ అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment