‘ఈఫ్లూటో’ స్కూటర్‌ విడుదల | E Pluto 7G Scooter Launched In Hyderabad | Sakshi
Sakshi News home page

‘ఈఫ్లూటో’ స్కూటర్‌ విడుదల

Published Mon, Feb 10 2020 4:27 AM | Last Updated on Mon, Feb 10 2020 4:27 AM

E Pluto 7G Scooter Launched In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ బ్యాటరీల తయారీకి కీలకమైన లిథియం పదార్థాన్ని దక్షిణ అమెరికా దేశాలైన అర్జెంటీనా, చిలీ, బొలీవియా నుంచి సేకరించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని నీతి ఆయోగ్‌ సభ్యుడు, డీఆర్‌డీవో మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ వి.కె.సారస్వత్‌ తెలిపారు. ప్యూర్‌ ఈవీ అనే సంస్థ ఐఐటీ–హైదరాబాద్‌ సాయంతో అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను సారస్వత్, డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. అనం తరం సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ఐఐటీ హైదరాబాద్‌ వంటి సంస్థలు రక్షణ రంగానికి ఉపయోగపడే పరికరాలు, టెక్నాలజీ అభివృద్ధికి ప్రయత్నించాలన్నారు.

ఈప్లూటో 7జీ ప్రత్యేకమైంది.. 
ఐఐటీ హైదరాబాద్‌ సహకారంతో తాము అభివృద్ధి చేసిన ఈ ప్లూటో 7జీ విద్యుత్‌ స్కూటర్‌ ప్రత్యేకమైందని ప్యూర్‌ ఈవీ సీఈవో రోహిత్‌ వడేరా తెలిపారు. బ్యాటరీ విడిభాగాలను దిగుమతి చేసుకున్నప్పటికీ మిగిలిన అన్ని టెక్నాలజీలను ఇక్కడే అభివృద్ధి చేశామని చెప్పారు. ఐఐటీ హైదరాబాద్‌ను ఆనుకుని ఉన్న ఫ్యాక్టరీలో ఈప్లూటో 7జీని తయారు చేస్తున్నామని చెప్పారు. ఈ స్కూటర్‌ ధర రూ. 79,999లని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement