stationary shopkeeper bought a new scooter: ఇటీవలే మహీంద్రా షోరూమ్‌లోని ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ రైతుని అవమానించి క్షమాపణలు చెప్పుకున్న కథ గురించి విన్నాం. అయితే ఇక్కడొక వ్యక్తి స్కూటర్ కొనక్కునేందుకు బస్తా చిల్లరతో షోరూమ్‌కి వెళ్లాడు. స్కూటర్‌ని మొత్తం ఆ చిల్లర నాణేలతోనే కొనుగోలు చేశాడు. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది.
అసలు విషయంలోకెళ్తే...అస్సాంలో హిరాక్ జె దాస్ అనే చిల్లర వ్యాపారి కొత్త స్కూటర్‌ని కొనుగోలు చేసేందుకు నెలలు తరబడి నాణేలను పొదుపు చేశాడు. అంతేకాదు ఎనిమిది నెలలు తరబడి పోగుచేసిన నాణేలన్నింటిన ఒక బస్తాలో వేసి షోరూంకి తీసుకువెళ్లాడు. అక్కడ ఆ షోరూం వాళ్లు ఆ నాణేలను ఒక ప్లాస్టిక్ బుట్టల్లో వేసుకుని లెక్కించారు. ఆ తర్వాత అతను తనకు నచ్చిన స్కూటర్‌ని కొనుకున్నాడు. అయితే అతను స్కూటర్‌ని మొత్తం చిల్లర నాణేలతోనే కొనుగోలు చేయడం విశేషం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
(చదవండి: "భార్యలను కొట్టండి" భర్తలకు సలహాలిచ్చిన మహిళా డిప్యూటి మంత్రి!)
Comments
Please login to add a commentAdd a comment