coins bag
-
బస్తా చిల్లర పైసలతో షోరూంకి వెళ్లాడు.. ఆ తర్వాత
stationary shopkeeper bought a new scooter: ఇటీవలే మహీంద్రా షోరూమ్‌లోని ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ రైతుని అవమానించి క్షమాపణలు చెప్పుకున్న కథ గురించి విన్నాం. అయితే ఇక్కడొక వ్యక్తి స్కూటర్ కొనక్కునేందుకు బస్తా చిల్లరతో షోరూమ్‌కి వెళ్లాడు. స్కూటర్ని మొత్తం ఆ చిల్లర నాణేలతోనే కొనుగోలు చేశాడు. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...అస్సాంలో హిరాక్ జె దాస్ అనే చిల్లర వ్యాపారి కొత్త స్కూటర్ని కొనుగోలు చేసేందుకు నెలలు తరబడి నాణేలను పొదుపు చేశాడు. అంతేకాదు ఎనిమిది నెలలు తరబడి పోగుచేసిన నాణేలన్నింటిన ఒక బస్తాలో వేసి షోరూంకి తీసుకువెళ్లాడు. అక్కడ ఆ షోరూం వాళ్లు ఆ నాణేలను ఒక ప్లాస్టిక్ బుట్టల్లో వేసుకుని లెక్కించారు. ఆ తర్వాత అతను తనకు నచ్చిన స్కూటర్ని కొనుకున్నాడు. అయితే అతను స్కూటర్ని మొత్తం చిల్లర నాణేలతోనే కొనుగోలు చేయడం విశేషం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: "భార్యలను కొట్టండి" భర్తలకు సలహాలిచ్చిన మహిళా డిప్యూటి మంత్రి!) -
నాణేల చెలామణీ..ప్రోత్సహకాల్ని పెంచిన ఆర్బీఐ
ముంబై: ‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా నాణేల చెలామణీపై బ్యాంకులకు ప్రోత్సహకాలు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రటించింది. ఇప్పటి వరకూ బ్యాగ్‌కు రూ.25 ప్రోత్సాహకం ఉంటే దీనిని రూ.65కు పెంచుతున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. గ్రామీణ, చిన్న స్థాయి పట్టణాల విషయంలో అదనంగా మరో రూ.10 ప్రోత్సాహకంగా లభిస్తుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమలవుతుందని ఆర్బీఐ పేర్కొంది. నాణేల పంపిణీ విషయంలో తమ బిజినెస్ కరస్పాండెంట్ల సేవలను మరింత వినియోగించుకోవాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. చదవండి : బ్యాంకింగ్ రుణ వృద్ధి 6.55 శాతం -
అక్క ఆనందం కోసం...తమ్ముడు...
జైపూర్, రాజస్థాన్: అక్కా, చెల్లెళ్లను ఆటపట్టించి సరదాగా వారిని ఏడిపించే అన్నా, తమ్ముళ్లను మనం చూస్తూనే ఉంటాం. ఖర్చులకు సరిపోక వారి పాకెట్ మనీ కూడా కొట్టేసే తోబుట్టువులను చూసే ఉంటాం. కానీ, సోదరి ఆనందం కోసం జైపూర్‌లోని ఓ కుర్రాడు ఏం చేశాడో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే.. ఆమె కోసం ఒకటా, రెండా ఏకంగా 62 వేల రూపాయలు కూడ బెట్టాడు. ఇందులో విశేషమేముంది అనుకోవచ్చు. పదమూడేళ్ల కుర్రాడు పాకెట్ మనీని కూడబెట్టడం, అందులోనూ అవన్నీ నాణేల రూపంలో ఉండడం విశేషమే కదా..! వివరాలు... రూపాల్, యాష్ అక్కాతమ్ముళ్లు. రూపాల్‌కు స్కూటీ అంటే ఇష్టం. యాష్ ఎలాగైనా, ఆమెకు స్కూటీని బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. తల్లిదండ్రులు పాకెట్ మనీగా ఇచ్చిన ఒక్కో రూపాయిని కూడబెట్టాడు. అలా జమ చేసిన మొత్తాన్ని ఓ పెద్ద బ్యాగులో వేసుకుని రూపాల్‌తో పాటు గతేడాది దీపావళి రోజున హోండా షోరూమ్‌కు మోసుకొచ్చాడు. అప్పటికే షోరూమ్ మూసే వేళయింది. అయితే, యాష్ తన అక్క కోసం దాచిన సొమ్ముని వారికి చూపించి ఎలాగైనా ఈరోజు ఆమెకు స్కూటీ కానుకగా ఇవ్వాలనీ, షోరూమ్ అప్పుడే మూసేయవద్దని వేడుకున్నాడు. కుర్రాడి మాటలకు ముచ్చట పడిన సిబ్బంది సరే అన్నారు. యాష్ తెచ్చిన బ్యాగులోని నాణేలను లెక్క పెట్టడం మొదలు పెట్టారు. రెండు గంటల పాటు అయిదుగురు సిబ్బంది ఆ మొత్తం నాణేలను లెక్కించగా అరవై రెండు వేల రూపాయలుగా తేలింది. స్కూటీకి సరిపడా డబ్బు అందడంతో సిబ్బంది వెంటనే బండిని వారికి అప్పగించారు. కళ్లలో కొండంత ఆనందం నింపుకున్న యాష్ తన సోదరి రూపాల్‌కు స్కూటీని బహుమతిగా ఇచ్చాడు. ఎంతో మంది పిల్లలకు ఆదర్శంగా నిలిచాడు. చివరివరకు ఈ విషయం పిల్లలు వారి తల్లిదండ్రులకు చెప్పకపోవడం గమనార్హం. మామూలుగా బండి కొనేందుకు వచ్చిన వారు కొంత మొత్తాన్ని నాణేల రూపంలో చెల్లించడం అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటుందనీ, కానీ.. ఇలా మొత్తం సొమ్ము నాణేలుగా అందించడం ఎప్పుడూ చూడలేదని షోరూమ్ జనరల్ మేనేజర్ సంతోష్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కకు బహుమతి ఇవ్వడం కోసం యాష్ ఇంతగా కష్టపడడం నిజంగా గొప్ప విషయమని అన్నారు. -
కోర్టులో మాజీ భార్యపై కోపంతో ఊగుతూ..
అహ్మదాబాద్: విడిపోయిన భార్యకు ప్రతి నెల చెల్లించాల్సిన మొత్తం చెల్లించకపోవడంతో ఆమె కోర్టుకు ఎక్కడం విడిపోయిన భర్తకు తెగ చిరాకును తెప్పించింది. కోర్టులోనే ఆమెకు చెల్లించాల్సిన మొత్తాన్ని నాణెముల రూపంలో విసుగ్గా అందించి లెక్కపెట్టుకో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అహ్మదాబాద్‌లో పృధ్వీ ప్రజాపతి, రమీలాబెన్ అనే మహిళ భార్యాభర్తలు. వారు కొన్ని కారణాల వల్ల 2011 నుంచి విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో భార్య కోర్టును ఆశ్రయించింది. తను బతికేందుకు ఖర్చుల నిమిత్తం కొంత చెల్లించాలని ఆమె కోర్టుకు విన్నవించింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు.. పృథ్వీ నెలకు సంపాదిస్తున్న రూ.4వేలల్లో రూ.1500 ఆమెకు చెల్లించాలని ఆదేశించింది. అయితే, తొలుత బాగానే చెల్లించిన అతడు 2014లో చెల్లించడం మానేశాడు. దీంతో ఆమె మరోసారి కోర్టు మెట్లెక్కింది. ఫలితంగా అతడిని కోర్టు మరోసారి బోనులో నిలబెట్టడంతో ఆగ్రహానికి లోనైన అతడు రూ.10 వేలను ఓ బ్యాగులో నాణేల రూపంలో తీసుకొచ్చి ఆమెకు అందించి లెక్కపెట్టుకో అంటూ విసుగ్గా వెళ్లిపోయాడు.