హీరో మోటోకార్ప్ ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త 'జూమ్' (Xoom) స్కూటర్ తన తొలి డెలివరీలను ముంబైలో ప్రారంభించింది. కంపెనీ ఈ స్కూటర్‌ని ఎల్ఎక్స్ (LX), విఎక్స్ (VX), జెడ్ఎక్స్ (ZX) వేరియంట్స్‌లో అందిస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 72,349 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
హీరో లేటెస్ట్ జూమ్ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న హోండా డియోకి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది. ఇది 110 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 8.05 బిహెచ్‌పి పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ i3S ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ కలిగి ఉండటం వల్ల స్కూటర్ కెపాసిటీ మరింత మెరుగ్గా ఉంటుంది.
జూమ్ స్కూటర్ రైడర్, పిలియన్‌కి సౌకర్యవంతంగా ఉన్న విశాలమైన సీటు కలిగి ఉంటుంది. ముందువైపు మంచి లైటింగ్ సెటప్, వెనుక హెచ్ షేప్ టైల్‌లైట్ కలిగి 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇందులో పొందుపర్చింది. ఫీచర్స్ పరంగా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జర్, గ్లోవ్ బాక్స్ లాంటివి ఉన్నాయి.
ఈ స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ సెటప్ వంటి సస్పెషన్ సెటప్ & ఫ్రంట్ డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ తో మంచి బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది. కస్టమర్ల అభిరుచికి తగిన విధంగా కంపెనీ తన కొత్త స్కూటర్‌ని పోలెస్టార్ బ్లూ, స్పోర్ట్స్ రెడ్, మాట్ అబ్రాక్స్ ఆరెంజ్, పెర్ల్ సిల్వర్ వైట్, బ్లాక్ అనే కలర్ ఆప్సన్స్ అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment