ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ భారత మార్కెట్‌లోకి కొత్త మ్యాక్సీ-స్కూటర్‌ను టీజ్ చేసింది. ఈ బైక్ భారత్‌లో తొలి మ్యాక్సి-స్కూటర్ అని కంపెనీ పేర్కొంది. బీఎమ్‌డబ్ల్యూ మోట్రాడ్ ఇండియా మ్యాక్సి స్కూటర్ పేరును ఇంకా వెల్లడించలేదు. కొత్త మాక్సి-స్కూటర్ కంపెనీ గ్లోబల్ పోర్ట్‌ఫోలియో నుంచి రెండు మిడ్-సైజ్ మ్యాక్సీ-స్కూటర్లలో ఒకటిగా ఉంటుందని తెలుస్తోంది. బీఎండబ్యూ మోట్రాడ్ తన పోర్ట్‌ఫోలియోలో బీఎండబ్యూ సీ400ఎక్స్,బీఎండబ్యూ సీ400జీటీలను కలిగి ఉంది. ఈ బైక్‌లను ఈ సంవత్సరం ప్రారంభంలో అప్‌డేట్ చేశారు.
రెండు స్కూటర్లు 350 సిసి ఇంజన్లను కలిగి ఉంది, కాగా భారత్‌లో బీఎండబ్యూ మాక్సి-స్కూటర్‌లో భాగంగా బీఎండబ్యూ సీ400జీటీను మార్కెట్లలోకి విడుదల చేయవచ్చునని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు. 2018లో బీఎండబ్యూ సీ400జీటీ మ్యాక్సి బైక్‌ను లాంఛ్ చేసింది. భారత మార్కెట్‌లో బైక్ ఎక్స్ షో రూమ్ ధర 6 లక్షలపైనా ఉంటుందని తెలుస్తోంది. బీఎండబ్యూ మ్యాక్సి బైక్ సింగిల్ సిలిండర్, 350సీసీ ఇంజన్ సామర్థ్యంతో రానుంది. బైక్‌లో అప్‌డేటేడ్ త్రోటెల్ బై వైర్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. 33.5 బీహెచ్‌పీ ఇంజన్ 35ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది.
Are you ready to rise to the next level of urban riding? BMW Motorrad India’s first Maxi-scooter is debuting soon.
— BMWMotorrad_IN (@BMWMotorrad_IN) July 16, 2021
Watch this space for more! #UrbanMobility#MakeLifeARide #BMWMotorradIndia #BMWMotorrad pic.twitter.com/Yu3wLbrUTF
Comments
Please login to add a commentAdd a comment