
న్యూఢిల్లీ: క్యాబ్ సేవల సంస్థ ఓలా, స్కూటర్ల షేరింగ్ ప్లాట్‌ఫామ్ ‘వోగో’లో 100 మిలియన్ డాలర్లను (రూ.720 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ పెట్టుబడులను నేరుగా అందించకుండా, లక్ష స్కూటర్లను వోగోకు అందించనుంది. దీనివల్ల వోగో తన కార్యకలాపాల విస్తరణకు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం రాకుండా స్కూటర్ల సరఫరాను పెంచుకోనుంది. వోగో స్కూటర్ల సేవలు ఓలా ప్లాట్‌ఫామ్‌పై ఉన్న 15 కోట్ల మంది కస్టమర్లకు త్వరలో అందుబాటులోకి రానున్నట్టు ఓలా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment