ఓలా స్కూటర్ యూజర్లకు ఆ కంపెనీ సీఈవో భవిశ్ అగర్వాల్ శుభవార్త చెప్పారు. గత ఆర్నేళ్లుగా ఎదురు చూస్తున్న కీలక ఫీచర్‌కి సంబంధించిన అప్‌డేట్‌ను వెల్లడించారు. అతి త్వరలోనే యూజర్లకు మూవ్‌ఓఎస్2 అప్‌డేట్ అన్‌లాక్ అవుతుందని తెలిపారు.
ఓలా స్కూటర్ ప్రీ పొడక‌్షన్‌లో ఉండగానే దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. లక్షన్నర ప్రీ బుకింగ్స్‌తో సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా వచ్చిన బూమ్‌తో స్కూటర్ డెలివరీ ఒత్తిడిలో పడిపోయింది ఓలా సంస్థ. ఆగష్టు 15న ప్రీ బుకింగ్స్ ప్రారంభమైతే అక్టోబరు చివరి వారం నాటికి గానీ డెలివరీ చేయలేకపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా కస్టమర్లకు బైకులు డెలివరీ అవుతున్నాయి.
అయితే యూజర్లకు డెలివరీ అయిన బైకుల్లో చాలా ఆప్షన్‌లో లాక్‌మోడ్‌లోనే ఉండిపోయాయి. డిజిటల్ కీ, మూవ్‌ఓస్ లాంటి ఫీచర్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. క్రమంగా ఒక్కో ఫీచర్‌ను అన్‌లాక్ చేస్తూ వస్తోంది ఓలా. దీనిపై ఇప్పటికే అనేక విమర్శలు ఓలాను చుట్టుముట్టాయి. ఈ తరుణంలో భవీశ్ అగర్వాల్ త్వరలోనే మూవ్‌ఓస్ 2 అందుబాటులోకి వస్తోందంటూ ట్వీట్ చేశాడు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఓలా స్కూటర్ డిజటల్ కన్సోల్‌లో నావిగేషన్ మ్యాప్ అందుబాటులోకి రానుంది.
Taking the wife out for some ice cream! Navigation on MoveOS 2 working great 👌🏼Coming very soon to all. pic.twitter.com/CUXh2mOQYQ
— Bhavish Aggarwal (@bhash) April 18, 2022
చదవండి: ఓలా మరో సంచలనం! 5 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. 160 కి.మీ ప్రయాణం..
Comments
Please login to add a commentAdd a comment