కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కావలసినంత డబ్బు తన దగ్గర లేదని ఇప్పటికే పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనని, ప్రచారంలో మాత్రం పాల్గొంటానని స్పష్టం చేశారు. ఒక ఆర్థిక మంత్రి దగ్గర డబ్బు లేదు అన్న మాటలు కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ.. అది నిజమే అని తాజాగా వెల్లడైన కొన్ని విషయాల ద్వారా తెలుస్తోంది.
కేంద్ర ఆర్థిక మంత్రికి కొంతవరకు ఆస్తులు ఉన్నప్పటికీ.. అప్పులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2022లో రాజ్యసభ సభ్యురాలిగా నామినేషన్ వేసిన సమయంలో ఆమె దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆమె ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. దీని ప్రకారం ఈమె మొత్తం ఆస్తుల విలువ రూ. 2.53 కోట్లుగా ఉంది.
నిర్మలా సీతారామన్‌కు ఉన్న మొత్తం ఆస్తిలో రూ. 1.87 కోట్ల స్థిరాస్థులు, రూ.65.55 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు సమాచారం. అప్పు రూ.26.91 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. 2016లో సీతారామన్ ఆస్తి విలువ రూ. 99.36 లక్షలు కాగా, 2022 నాటికి రూ. 1.7 కోట్లకు పెరిగింది. 2024 నాటికి ఈ ఆస్తి విలువ కొంత వరకు పెరిగి ఉండవచ్చు.
2016, 2022 డిక్లరేషన్‌ల ప్రకారం నిర్మలా సీతారామన్‌కు ఒక 'బజాజ్ చేతక్' స్కూటర్ ఉన్నట్లు సమాచారం. 2016లో రూ.7.87 లక్షల విలువైన 315 గ్రాముల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. 2022 నాటికి బంగారం పరిమాణం పెరగలేదు, కానీ పెరిగిన ధరల కారణంగా ఆ బంగారం విలువ దాదాపు రెండింతలు పెరిగి రూ.14.49 లక్షలకు చేరుకుంది. ఇప్పటి ధరల ప్రకారం బంగారం విలువ రూ. 19.4 లక్షల నుంచి రూ. 21.18 లక్షల వరకు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment