న్యూఢిల్లీ: ఇటీవల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యూఎస్ పర్యటనలో భాగంగా నిర్వహించిన మొహబ్బత్ కీ దుకాన్ కార్యక్రమంలో ప్రస్తుత ముస్లింల పరిస్థితి 80వ దశకంలో దళితులను పోలి ఉందని చేసిన వ్యాఖ్యలతో మొదలు, అదేపనిగా బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పర్యటనను కొనసాగిస్తున్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ నీ ప్రేమంతా రాజకీయాలు చేయడం మీదే ఉంది తప్ప దేశం మీద కొంచెమైనా లేదు.. ఇదేం ప్రేమ.." అంటూ ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.
ఇదేం ప్రేమ..
స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. ప్రేమతత్త్వం గురించి మాట్లాడేటప్పుడు అందులో సిక్కుల హత్యల గురించి మాట్లాడారా? ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు మీ హయాంలో జరిగిన రాజస్థాన్ మహిళల కిడ్నాపుల గురించి మాట్లాడారా? హిందువుల జీవన విధానం అస్తవ్యస్తం చేయడం కూడా మీ ప్రేమలో భాగమేనా? దాని గురించి మాట్లాడరేం? భారత దేశం ఎదుగుదలను సహించలేని వారితో చేతులు కలపడం, మన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బయటవారి మద్దతు కోరడం ఇవన్నీ మీ ప్రేమలో భాగమేనా? నీ దేశంపై కాకుండా కేవలం నీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒలకబోసే ప్రేమ.. ఇదేమి ప్రేమ? అంటూ ప్రశ్నించారు.
ప్రేమ పేరుతో ద్వేషం పెంచుతున్నారు..
పది రోజుల యూఎస్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లను టార్గెట్ చేస్తూ అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యాఖ్యలకు ప్రతిగా బీజేపీ నాయకులు ఒక్కొకరుగా రాహుల్ గాంధీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. పరాయి గడ్డ మీద ప్రేమ పేరుతో దేశంపై ద్వేషాన్ని పెంచుతున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు.
#WATCH | Union Minister Smriti Irani speaks on Rahul Gandhi's "Mohabbat ki dukan" remark; says, "...When you talk about 'Mohabbat', does that include the killing of Sikhs? When you talk about 'Mohabbat', does that include the kidnapping of women in Rajasthan? When you talk about… pic.twitter.com/Rjx1Xebqme
— ANI (@ANI) June 8, 2023
ఇది కూడా చదవండి: రెండు దేశాలకు మంచిది కాదు.. భారత విదేశాంగ శాఖ
Comments
Please login to add a commentAdd a comment