
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా అవార్డును అందుకుంటున్న బన్నీ
‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. పుష్పరాజ్‌గా బన్నీ నటనకు యావత్ భారత్ సినీలోకం బ్రహ్మరథం పట్టారు. దీంతో ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడంతో పాటు అవార్డుల పంటను కూడా పండిస్తోంది. ఇప్పటికే ‘పుష్ప’లో అల్లు అర్జున్ నటనకుగాను ఫిలింఫేర్, సైమా అవార్డులు రాగా.. తాజాగా బన్ని ఖాతలో మరో అవార్డును చేరింది. ఎంటర్‌టైన్ కేటగిరిలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు బన్నీ. ఈ అవార్డును ఢిల్లీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతులు మీదుగా అందుకున్నాడు.
(చదవండి: అనుష్కపై గరికపాటి కొంటె వ్యాఖ్యలు.. ఆర్జీవీ ట్వీట్ వైరల్)
దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉత్తరాదికి చెందిన అవార్డును అందుకున్న దక్షిణాది నటుడిగా అల్లు అర్జున్ నిలవడం గమనార్హం. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘నేను చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లుగా పనిచేస్తున్నాను. నేను దక్షిణాదిలో ఎన్నో అవార్డులు అందుకున్నాను. ఉత్తరాది నుంచి అవార్డులు అందుకోవడం ఇదే తొలిసారి కాబట్టి ఇది నాకు చాలా ప్రత్యేకం’అంటూ చెప్పుకొచ్చారు. ఈ అవార్డును కోవిడ్ వారియర్స్ డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు అంకింతం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment