
లక్నో: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టబోయే ‘భారత్ న్యాయ యాత్ర’పై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరాని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’సంబంధించిన విషయం విన్నానని తెలిపారు. ఈ రోజుల్లో అన్యాయానికి తెలిసిన వ్యక్తులు.. న్యాయం చేస్తున్నట్లు నటిస్తున్నారని(రాహుల్ గాంధీని ఉద్దేశించి)ఎద్దేవా చేశారు.
రెండు రోజుల ఆమేథీ పర్యటనలో కేంద్ర మంత్రి స్మృతి ఇరాని పాల్గొన్నారు. గౌరీగంజ్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగిన సామాజిక సాధికారత శిబిరం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రతి ఏడాది 10 కోట్ల మంది పేద కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని పేర్కొన్నారు.
ఇక.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’ పేరుతో తూర్పున మణిపూర్ నుంచి పశ్చిమాన మహారాష్ట్ర వరకు పాదయాత్ర చేపట్టనున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర జనవరి 14న మాణిపూర్ నుంచి ప్రారంభమై.. మార్చి 20న ముంబైలో ముగియనుంది. సుమారు 67 రోజుల పాటు 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల గుండా ఈ యాత్ర సాగనుంది. ఇక.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆమేథీ సెగ్మెంట్‌లో రాహుల్ గాంధీ.. స్మృతి ఇరాని చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
చదవండి: పంజాబ్ సీఎంపై బీజేపీ నేత ఫైర్
Comments
Please login to add a commentAdd a comment