స్మృతి ఇరానీతో ఆమె కూతురు జోయిష్ ఇరానీ
న్యూఢిల్లీ: స్మృతి ఇరానీ కుతూరు జోయిష్ ఇరానీ.. గోవాలో లైసెన్స్ లేకుండా బార్ నడుపుతోందని కాంగ్రెస్ ఆరోపించడం దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను స్మృతి ఇరానీ ఖండించారు. తన కూతురు కాలేజీలో చదువుకుంటోందని ఆమె పేరుపై ఎలాంటి రెస్టారెంట్లు లేవని కాంగ్రెస్ నేతలపై ఎదురుదాడికి దిగారు. అయితే యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ తాజాగా ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. ఆ రెస్టారెంట్ జోయిష్ ఇరానీదే అనేందుకు ఇదే సాక్ష‍్యం అని తెలిపారు.
Which of the two is lying? pic.twitter.com/Q4hKfvG9IZ
— Srinivas BV (@srinivasiyc) July 23, 2022
కాంగ్రెస్ షేర్ చేసిన వీడియోలో ఆ రెస్టారెంట్ తనదే అని జోయిష్ ఇరానీ అన్నారు. గోవాలో ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా లోకల్ ఫుడ్ దొరుకుతుందని, కానీ ఇంటర్నేషనల్ ఫుడ్ మాత్రం తన రెస్టారెంట్‌లోనే లభిస్తుందని ఆమె మాట్లాడినట్లు వీడియోలో ఉంది. దీన్నే సాక్ష‍్యంగా చూపుతూ కాంగ్రెస్ మరోమారు తన ఆరోపణలను సమర్థించుకుంది.
అంతకుముందు స్మృతి ఇరానీ మీడియా సమావేశం నిర్వహించి ఎమోషనల్ అయ్యారు. తాను రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శించడం వల్లే తన కూతుర్ని లక్ష‍్యంగా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురుకు ఆ రెస్టారెంట్‌తో ఎలాంటి సంబంధం లేదన్నారు.
చదవండి: ఆ ద్వేషంతో 18 ఏళ్ల నా కూతురిపై ఆరోపణలా.. స్మృతి ఇరానీ ఎమోషనల్
Comments
Please login to add a commentAdd a comment