మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఈ మధ్య భారతీయ వంటలపై ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం రోటీలు తయారు చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశారు. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దగ్గర కిచిడీకి పోపు (తడ్కా) ఎలా పెట్టాలో నేర్చుకున్నారు. ఆ వీడియోను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్విటర్‌లో షేర్ చేశారు.
అత్యంత పోషక విలువలు ఉన్న భారతీయ సూపర్ ఫుడ్ కిచిడీకి బిల్‌గేట్స్ పోపు(తడ్కా) పెట్టారు అంటూ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. పోషణ్ అభియాన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిల్‌గేట్స్ పాల్గొన్నారు. ఈ వీడియోలో కిచిడీకి పోపు(తడ్కా) ఎలా పెట్టాలో బిల్ గేట్స్‌కు స్మృతి ఇరానీ నేర్పించారు. బిల్ గేట్స్ కూడా స్వయంగా దినుసులు వేసి గరిటెతో కలియపెట్టారు. అంతా పూర్తయ్యాక కిచిడీని రుచి చూశారు.
ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి ఒక రోజులో దాదాపు నాలుగు లక్షల మంది వీక్షించారు. దాదాపు 10 వేల లైక్‌లు, అనేక కామెంట్‌లు వచ్చాయి. ఇప్పుడు ఈ కిచిడీని మైక్రోసాఫ్ట్ కిచిడీ అని పిలుస్తామంటూ పలువులు యూజర్లు చమత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment