
ఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేంద్ర మంత్రి, స్మృతి ఇరానీ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో మరోసారి తన మార్క్ చూపించుకున్నారు. త్రోబ్యాక్ ఫోటోల దగ్గర నుంచి సరదా మీమ్స్ వరకు ఎప్పటికప్పడు పోస్టులు చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్న గిబ్బరిష్ ఛాలెంజ్‌ను పూర్తిచేసి వావ్ అనిపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియాలను పోస్ట్ చేయడంతో ఇవి వైరల్ అయ్యాయి. స్మృతి జీ సూపర్భ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
గిబ్బరిష్ ఛాలెంజ్ అంటే?
ఎప్పటికప్పడు లేటెస్ట్ పిల్టర్స్‌తో ఆకట్టుకునే ఇన్‌స్టాగ్రామ్‌లో గిబ్బరిష్ ఛాలెంజ్ తెగ ట్రెండ్ అవుతోంది. గజిబిజిగా ఉండే పదబంధాన్ని కరెక్ట్‌గా గెస్ చేయడమే ఈ ఫిల్టర్. అయితే కేవలం 10 సెకన్లలోనే పదాన్ని గుర్తుపట్టాలి. ఆలోపు గెస్ చేయలేకపోతే టైం అవుట్ అయ్యాక సరైన సమాధానం ఎంటో తెర మీద కనిపిస్తుంది. రెండుసార్లు ఈ ఛాలెంజ్‌ను ట్రై చేసి తక్కువ టైంలోనే కరెక్ట్‌గా గెస్ చేశారు స్మృతి ఇరానీ. దీనికి సంబంధించిన వీడియాలను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ('నేను క్వారంటైన్‌లో ఉన్నా.. మరి మీరు' )
Comments
Please login to add a commentAdd a comment