
ఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ ఇళ్లలోనే ఉండి ఆ మహమ్మారిని తరిమేద్దామంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. తాజాగా స్మృతి ఇరాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో లూస్ హెయిర్‌లో నవ్వుతూ సెల్ఫీ దిగిన ఫోటోను షేర్ చేశారు. 'కరోనా నేపథ్యంలో నేను ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ హోం క్వారంటైన్ పాటిస్తున్నా. ఈ సందర్భంగా ప్రజలందరు ఇళ్లలోనే ఉంటూ సామాజిక దూరం పాటించాలని కోరుతున్నా. దయచేసి అందరూ ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండండి' అంటూ తెలిపారు. కాగా బుధవారం ప్రఖ్యాత సంగీత విధ్వాంసుడు రవిశంకర్ 100వ పుట్టినరోజు సందర్భంగా ఆయన గుర్తుగా ఒక వీడియోను షేర్ చేశారు. అంతేగాక ఇంట్లోనే ఉంటున్న స్మృతి తన పాతకాలం ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అలనాటి జ్ఞాపకాలను ఆస్వాదిస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 166కు చేరుకుంది.
(భారత్‌లో 24 గంటల్లోనే 591 కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment