
న్యూఢిల్లీ: దేశంలోనే ప్రముఖ వైవిద్య రాజకీయ నాయకులలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒకరు. సామాజిక సమస్యలపై నిత్యం స్పందిస్తు సోషల్ మీడియాలో ఆక్టివ్‌గా తన అభిప్రాయాలను చెబుతుంటారు. తన జీవితంలో జరిగిన ప్రేరణ కలిగించే సంఘటనలను నిరంతరం పోస్ట్ చేస్తు అభిమానులను ఉత్సాహ పరుస్తుంటారు. తాజాగా స్మృతి ఇరానీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేశారు. ‘ఇతరులకు మంచి చేయడానికి ప్రజలందరు ప్రయత్నించాలని.. మీరు చేసే మంచి పని వల్ల ఉహించని విధంగా లబ్ది చేకురుతుందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు’.
ఒకవేళ మంచి చేసే అవకాశం రాకపోతే కనీసం మంచి ఆలోచనలు చేయాలని సలహా ఇచ్చారు. ఈ పోస్ట్ ద్వారా ప్రజలకు ప్రేరణ కలిగించేందుకు స్మృతి ఇరానీ ప్రయత్నించారు. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. దాదాపు 17,000మంది నెటిజన్లు స్మృతి ఇరానీ పోస్ట్‌కు లైక్ చేశారు. స్మృతి ఇరానీ పోస్ట్‌పై ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.
చదవండి: మిస్సింగ్ పోస్టర్లు: 'స్మృతి ఇరానీ ఎక్కడ?'