![Smriti Irani Shares Hilarious Meme After Infected By Corona Virus - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/29/smriti.gif.webp?itok=qPd8NXLe)
కేంద్ర జౌళి, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బుధవారం ఆమె ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తనకు దగ్గర ఉన్నవారందరూ టెస్ట్ చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు చాలా మంది నేతలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇక స్మృతి ఇరానీ తనకు కరోనా రావడంపై స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫన్నీ మీమ్‌ను షేర్ చేశారు.
‘నేను ఆనారోగ్యం పాలు అయ్యాను అంటే నాకు భయంగా ఉంది. ఎందుకంటే నేను వారం రోజుల నుంచి వెజ్ ఐటమ్స్ తీసుకుంటున్నాను. ఎంత ధైర్యం నీకు? నేను కూరగాయలు తీసుకున్నప్పుడే ఇలా జరిగింది’ అని కాప్షన్ జత చేస్తూ ఒక మీమ్‌ను తన అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ మీమ్‌ను ఇప్పటికే 25,000ల మందికి పైగా లైక్ చేశారు. ఇక కొంత మంది కామెంట్ ఇలాంటి దురదృష్టకర విషయంలోనూ మీకు ఇంట్లో ఉండటానికి, విశాంత్రి తీసుకోవడానికి అవకాశం లభించింది. ఆవిషయంలో ఆనందంగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.
చదవండి: స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్
Comments
Please login to add a commentAdd a comment