సాక్షి, హైదరాబాద్: ప్రధానికి స్వాగతం పలికే ప్రోటోకాల్‌ను కూడా పాటించని నేత సీఎం కేసీఆర్ అని బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యం అన్నారు. రెండు కళ్ల విధానం బీజేపీలో చెల్లుబాటు కాదన్నారు.
బీజేపీ పాలనలో 8 ఏళ్లలో దేశం ఎంతో లబ్ది పొందిందని, 11 కోట్ల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధులు అందాయని పేర్కొన్నారు. బీజేపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యలు అద్భుతమని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment