సాక్షి, న్యూఢిల్లీ: మహిళల రక్షణ, భద్రత లక్ష్యంగా ఏర్పాటు చేసిన జాతీయ హెల్ప్‌లైన్ నంబరు 7827170170ను కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆవిష్కరించారు. 24 గంటలూ పనిచేసే ఈ హెల్ప్‌లైన్‌ను జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఏర్పాటు చేసింది.
అలర్లు, హింసాకాండ బాధిత మహిళలకు ఆన్‌లెన్ ద్వారా సహాయం అందించేందుకు, వారికి అండగా నిలిచేందుకు ఈ హెల్ప్‌లైన్ ఏర్పాటైంది. పోలీసు యంత్రాంగం, ఆసుపత్రులు, జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ, మానసిక నిపుణుల సేవలు తదితర సదుపాయాలతో ఈ నంబరును అనుసంధానం చేయడం ద్వారా బాధిత మహిళలకు భద్రత కల్పించనున్నారు.
మహిళల రక్షణ, భద్రత లక్ష్యంగా...జాతీయ హెల్ప్‌లైన్
Published Wed, Jul 28 2021 8:10 AM | Last Updated on Wed, Jul 28 2021 8:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment