
సిద్దిపేట: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర తొలి విడత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నేడు ముగిసింది. ఈ నేపథ్యంలో శనివారం హుస్నాబాద్‌లో భారీ బహరంగ ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ సభకు హాజరయ్యారు. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు స్మృతి ఇరానీ. ఎంఐఎంకు టీఆర్‌ఎస్ భయపడుతుందేమో కానీ బీజేపీ భయపడదని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. ‘‘ఉద్యమం నుంచి కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి అని మళ్లీ మోసం చేశారు. రాష్ట్రం తెచ్చుకుంది నీళ్లు నిధులు నియామకాల కోసం. నిధులు కేసీఆర్ జేబులోకి వెళ్తున్నాయి. నియామకాలు కేసీఆర్ ఇంట్లోకి వెళ్లాయి’’ అన్నారు.
(చదవండి: కష్టాలు కదిలించాయి.. కన్నీళ్లు తెప్పించాయి)
ప్రగతి భవన్‌లో కాషాయ జెండా ఎగరవేసే వరకు యాత్ర కొనసాగిస్తాం: డీకే అరుణ
నియంత పాలన అంతం చేసేందుకు ప్రారంభించిందే ప్రజాసంగ్రామ యాత్ర.. ప్రభుత్వంలోకి వచ్చే వరకూ దశలవారీగా యాత్ర చేపడతాం అన్నారు బీజేపీ నేత డీకే అరుణ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ అభివృద్ధి కావాలంటే తెలంగాణ రావాలన్నారు. ఇప్పుడేమో అన్ని ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారు అని కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నాడు. తెలంగాణలో ఆదాయం ఎటు పోతుంది.. గ్రామాల్లో అభివృద్ధి ఎందుకు జరగడం లేదు. దళిత బందు హుజూరాబాద్ లోనే ఎందుకు... ప్రతి పేదవారికి ఆర్థిక సాయం చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
(చదవండి: క్షమించండి.. ఈరోజు సోమవారమా?!)
‘‘ఏ పథకానికీ పైసలు లేవు అంటడు.. కాని హుజూరాబాద్ ఎన్నిక రాగానే కేసీఆర్‌కు దళిత బంధు గుర్తుకు వచ్చింది. ఏం చేసైనా ఈటెలను ఓడించాలని చూస్తున్నారు. ఎన్నికల లోపు దళిత బందు అన్ని జిల్లాల్లో అమలు చేయాలి. తెలంగాణ ఉద్యమంలో ఈటల ముందుండి పోరాటం చేశాడు. పార్టీలో నిరంకుశత్వం.. అవినీతి గురించి మాట్లాడుతున్నాడని.. కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఈటలను బయటకు పంపిండు. కేసీఆర్ ఎక్కడ పోయినా సోది తప్ప ఏదీ చెప్పడు. కథలతోనే ప్రజలను మోసం చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం నిదులతోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు’’ అని తెలిపారు.
చదవండి: సిట్టింగ్‌లకు నో ఛాన్స్.. సుమారు 150 మందికి అవకాశం లేదు !
Comments
Please login to add a commentAdd a comment