ఇంఫాల్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి స్మృతిఇరానీ మణిపూర్‌లో పర్యటించారు. అందులో భాగంగా శుక్రవారం వాంగ్‌ఖీ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె అక్కడి మహిళలు వేసుకునే వస్త్రాలను ధరించి.. సంప్రదాయ నృత్య కళాకారులతో డ్యాన్స్ స్టెప్పులు వేశారు. దీంతో అక్కడ ఉన్న స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రిని మరింత ఉత్సాహపరిచారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. మణిపూర్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 28, మార్చి 5న రెండు దశల్లో పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
#WATCH | Union Minister Smriti Irani joins artists performing traditional dance at an event in Wangkhei area of Imphal East, Manipur pic.twitter.com/jQtqKMkOJW
— ANI (@ANI) February 18, 2022
Comments
Please login to add a commentAdd a comment