ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ పరిధిలో గల మెదన్ మావాయి గ్రామంలో కేంద్ర మంత్రి, అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ నూతనంగా ఇంటిని నిర్మించుకున్నారు. నేటి (గురువారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపీ స్మృతి ఇరానీ కుటుంబ సభ్యులు నూతన గృహంలో పూజలు నిర్వహించనున్నారు.
సొంత ఇంటి గృహప్రవేశం సందర్భంగా స్మృతి ఇరానీ తన పార్లమెంటరీ నియోజకవర్గంలోని 20 వేల మందికి గురువారం మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. ఎంపీ స్మృతి ఇరానీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ కొత్త ఇంటిలోకి అడుగుపెట్టనున్నారు. ఈ గృహ ప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా, మంత్రి ధరంపాల్ సైనీ, స్వతంత్ర దేవ్ సింగ్, అమేథీ ఇన్‌ఛార్జ్ మంత్రి గిరీష్ చంద్ర యాదవ్, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి మయాంకేశ్వర్ శరణ్ సింగ్ తదితరులు పాల్గొంటున్నారు.
స్మృతి ఇరానీ నూతన నివాసంలో సేవకులు, అతిథులకు పత్యేక గదులతో పాటు విలేకరుల సమావేశ గది కూడా ఉంది. ఎంపీ స్మృతి ఇరానీ నూతన గృహం సిద్ధమైన తరుణంలో గ్రామాభివృద్ధి కూడా జరుగుతుందని స్థానికులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment