భర్త కోసం స్మృతి స్పెషల్‌ డిష్‌.. | Smriti Irani Cooks Egg Fried Rice For Her Husband | Sakshi
Sakshi News home page

భర్త కోసం స్మృతి స్పెషల్‌ డిష్‌..

Published Wed, Feb 12 2020 4:41 PM | Last Updated on Wed, Feb 12 2020 5:16 PM

Smriti Irani Cooks Egg Fried Rice For Her Husband - Sakshi

నటిగా, నిర్మాతగా, రాజకీయ నాయకురాలుగా.. తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. అయితే ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడమే కాకుండా సరదా పోస్టులతో కూడా సందడి చేస్తారు.అలాగే తన కుటుంబానికి సంబంధించిన విశేషాలను కూడా ఆమె అప్పుడప్పుడు షేర్‌ చేస్తూంటారు. తాజాగా వంటల్లో తనకున్న ప్రావీణ్యాన్ని ఆమె అభిమానులతో పంచుకున్నారు.

తాజాగా తన భర్త జూబిన్‌ ఇరానీ కోసం స్మృతి ప్రత్యేకంగా ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌ తయారుచేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అలాగే ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌ ఎలా తయారు చేయాలో కూడా ఆమె వివరించారు. క్యాప్షన్స్‌తో కూడిన 7 ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరిస్‌లో ఉంచారు. కాగా, కొద్దిరోజుల క్రితం స్మృతి తన కూతురు జోయిష్‌ ఇరానీ కోసం వెజ్‌ న్యూడిల్స్‌, చికెన్‌ మంచురియాను తయారు చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/7

2
2/7

3
3/7

4
4/7

5
5/7

6
6/7

7
7/7

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement