న్యూఢిల్లీ: ఈడీ విచారణకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో రాహుల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్‌కు మద్దతుగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది.కేంద్రం కక్ష సాధిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ చేపట్టిన నిరసనలను బీజేపీ తప్పుపట్టింది.
అక్రమాలపై విచారణ జరిపితే ఎందుకు అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ఈడీ అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకే కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టిందని, ఇది ముమ్మాటికీ కుట్రే అని ఆమె మండిపడ్డారు. గాంధీ ఆస్తులను రక్షించేందుకు కాంగ్రెస్ ఆందోళనలకు పిలుపునిచ్చిందని విమర్శించారు.
జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వ్యక్తి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. గాంధీ కుటుంబం అవినీతికి కాంగ్రెస్ శ్రేణులు మద్దతు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, అందులో రాహుల్ గాంధీ కూడా ఒకరని నొక్కి చెప్పారు.
సంబంధిత వార్త: నేషనల్ హెరాల్డ్ కేసేంటి?.. అసలేం జరిగింది?
Press conference by Union Minister Smt. @smritiirani at party headquarters in New Delhi. https://t.co/tAWpWUJRvT
— BJP (@BJP4India) June 13, 2022
Comments
Please login to add a commentAdd a comment