![Thank You TikTok : Smriti Irani old video viral - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/3/smriti%20Irani.jpg.webp?itok=NAjnbmgo)
సాక్షి, న్యూఢిల్లీ: టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లపై నిషేధంపై ఒకవైపు మిశ్రమ స‍్పందన వ్యక్తమవుతుండగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గతంలో చేసిన వీడియో ఇపుడు నెట్‌లో వైరల్ అవుతోంది. కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భాగంగా టిక్‌టాక్‌కు ప్రత్యేక ధన్యావాదాలు తెలుపుతూ కేంద్రమంత్రి చేసిన వీడియోను పలువురు ట్విటర్‌లో విరివిగా పోస్ట్ చేస్తున్నారు.
ఈ వీడియోలో కరోనాపై ఐక్యంగా పోరాడాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు లక్షలాదిమంది భారతీయులనుంచి స్పందన లభించిందంటూ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా టిక్‌టాక్ పీపీఈ సూట్స్ విరాళాన్ని, భాగస్వామ్యాన్ని ప్రస్తావించిన కేంద్ర మంత్రి టిక్‌టాక్ ఇండియా సీఈవో నిఖిల్ గాంధీకి థ్యాంక్యూ చెప్పడంతో పాటు..ఈ వీడియో ప్రతివారికీ చేరాలంటూ కోరడం విశేషం. ('మేక్ ఇన్ ఇండియా'కు కట్టుబడి ఉన్నాం: వన్‌ప్లస్)
కాగా టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, టిక్‌టాక్, కామ్‌స్కానర్, షేరిట్‌తో సహా 59 చైనా యాప్‌లపై నిషేధాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టిక్‌టాక్ యోచిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ వాదనలను కంపెనీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. (నిషేధంపై టిక్‌టాక్ స్పందన)
Arre Smriti ji! Yeh Kya! Thanking Tik Tok?! pic.twitter.com/GJaJzaAFZn
— Prashant Bhushan (@pbhushan1) July 3, 2020
Comments
Please login to add a commentAdd a comment