తండ్రి పరలోకంలో.. తల్లి పరాయి దేశంలో.. | childrens become orphans after father died, | Sakshi
Sakshi News home page

తండ్రి పరలోకంలో.. తల్లి పరాయి దేశంలో..

Mar 27 2017 5:27 PM | Updated on Aug 16 2018 4:36 PM

తండ్రి పరలోకంలో.. తల్లి పరాయి దేశంలో.. - Sakshi

తండ్రి పరలోకంలో.. తల్లి పరాయి దేశంలో..

రెడ్డివారిపల్లెకు చెందిన పరికిజోన నాగేంద్రనాయుడు (35) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు

► అనారోగ్యంతో మృతి చెందిన తండ్రి
► సౌదీకి వెళ్లి జాడలేని తల్లి
► అనాథలైన నలుగురు పిల్లలు


గాలివీడు: గాలివీడు మండల పరిధిలోని గొట్టివీడు పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన పరికిజోన నాగేంద్రనాయుడు (35) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇతనికి భార్య పార్వతి, నలుగురు సంతానం ఉన్నారు. అయితే భార్య పార్వతి జీవనోపాధి కోసం సౌదీకి వెళ్లడంతో వారి పిల్ల లు అనాథలు గా మిగిలారు. వివరాలిలా ఉన్నాయి. నాగేంద్రనాయుడు భార్య పార్వతి ఏడాది క్రితం కుటుంబ పోషణ కోసం సౌదీకి వెళ్లింది. అక్కడికి వెళ్లిన తర్వాత మొ దట్లో రెండు నెలలు తాను సంపాదించిన సొమ్మును కుటుంబ సభ్యులకు పంపింది. ఆ తర్వాత ఆమెకు సం బంధించిన ఎలాంటి సమాచారం వీరికి అందలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ తెలుసుకోండంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తల్లి ఆచూకీ తెలియక దిగులు చెందిన తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు.

అమ్మా.. నాన్నలు దూరం కావడంతో దిక్కు తోచని స్థితిలో ఆ బిడ్డలు విలపిస్తున్న తీరు చూసి ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. సౌదీలో ఏమైందో కూడా తెలియని ఆ తల్లి ఆచూకీ తెలుసుకుని ఆమెను స్వదేశానికి రప్పించేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీ చొరవ చూపాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మిదేవమ్మ,  జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీ అబ్దుల్‌రహీం, మాజీ సర్పంచ్‌ మల్లికార్జున నాయుడు, మాజీ ఎంపీటీసీ చిన్నరెడ్డిలు మృతుని కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. సౌదిలో ఉన్న తల్లిని ఇండియాకు రప్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement