
ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రుల అకాల మరణంతో అనాథలుగా మిగిలిన ముగ్గురు పిల్లలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సత్యనారాయణ ఏడాది క్రితం కాలం చేశాడు. అతని భార్య అనురాధ కూడా ఇటీవలే మరణించారు. దీంతో ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు. తొమ్మిదేళ్ల పెద్ద కుమారుడే పెద్ద దిక్కుగా మారి తన చెల్లి, తమ్ముడి ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. ఈ కథనం ఎంతో మందిని కదిలించగా నటుడు సోనూసూద్ వారికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. (సోనూ సూద్ వెనుక సోనాలి పాత్ర)
వారు ఎంతమాత్రం అనాథలు కారని, వారి బాధ్యత తాను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వారిని మహారాష్ట్రలోని నాసిక్‌కు తీసుకువచ్చి ఓ ఆశ్రమంలో ఉంచుతానని తెలిపారు. మరోవైపు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సైతం వారి పరిస్థితికి చలించిపోయారు. ఆ ముగ్గురిని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. వారి బాధ్యతను తన భుజాలపై వేసుకుంటానని వెల్లడించారు. అయితే ఆ ముగ్గురు పిల్లలు ఈ ఇద్దరిలో ఎవరి దగ్గరకు వెళ్తారనేది ఇంకా నిర్ణయించుకోలేదు. (సోనూసూద్ అన్‌లిమిటెడ్ : వారి బాధ్యత నాదే)
Comments
Please login to add a commentAdd a comment