సమావేశంలో మాట్లాడుతున్న అనాథలు
మేము కూడా భారత మాత బిడ్డలమేనని, చేయని నేరానికి అనాథలుగా ముద్రపడి అనేక అవమానాలకు గురువుతూ జీవన పోరాటం సాగిస్తున్నామని, తమను ఆదుకోవాలని వరంగల్ జిల్లా జఫర్‌గఢ్ మండలంలోని ‘మా ఇల్లు’ అనాథ ఆశ్రమ విద్యార్థులు వేడుకున్నారు.శనివారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
-
అనాథ బిడ్డల హక్కుల సాధనకు ఢిల్లీ యాత్ర
న్యూశాయంపేట : మేము కూడా భారత మాత బిడ్డలమేనని, చేయని నేరానికి అనాథలుగా ముద్రపడి అనేక అవమానాలకు గురువుతూ జీవన పోరాటం సాగిస్తున్నామని, తమను ఆదుకోవాలని వరంగల్ జిల్లా జఫర్‌గఢ్ మండలంలోని ‘మా ఇల్లు’ అనాథ ఆశ్రమ విద్యార్థులు వేడుకున్నారు. శనివారం హన్మకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమకు చదువుకుందామన్న కోరిక ఉన్నా పాఠశాలకు వెలితే పుట్టిన తేదీ, కులం, ఇంటిపేరు, తల్లి దండ్రుల పేర్లు, చిరునామా ఏమిటని ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏం చెప్పాలో తెలియక విద్యాభ్యాసానికి దూరమవుతున్నామన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత 8 సంవ్సరాలుగా మా ఇల్లు ఆశ్రమం ద్వారా మా హక్కులు కోసం పోరాటాలు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి మా గోడును చెప్పుకునేందుకు ఈ నెల 25 నుంచి 29 వరకు ఢీల్లి యాత్ర చేపడుతున్నట్లు వివరించారు. దేశంలోని అనాథలు ఎదుర్కొంటున్న సమస్యలను, పాలకులు ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి తమకు రాజ్యంగ బద్దమైన హక్కులు కల్పించాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నయ్య పాల్గొన్నారు.