
ముంబై: ఉత్తరప్రదేశ్‌లో ఓ సామాజిక కార్యకర్తను మదర్ ఆఫ్ ఆర్పన్స్‌గా సత్కరించారు. సింధుతాయి సఫ్కల్ అనే సామాజిక కార్యకర్త చూపిన అసమాన మానవత్వానికి... రచయిత, మానవతావాది, జర్నలిస్టు అయినటువంటి డాక్టర్ రామ్‌మనోహర్ త్రిపాఠీ గౌరవార్థం ఇచ్చే డాక్టర్ రామ్‌మనోహర్ త్రిపాఠీ లోక్‌సేవ సమ్మాన్‌తో సత్కరించారు. 70 ఏళ్ల సింధుతాయ్‌కు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. పూనేకు చెందిన సామాజిక కార్యకర్త సింధుతాయ్.
తన జీవితం మొత్తం వెనుకబడిన వర్గాల వారి కోసం ఎంతో సేవ చేశారు. తన సేవలో భాగంగా 1000మందికి పైగా పిల్లలను దత్తత తీసుకున్నారు. అవార్డు తీసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సుసంపన్నమైన మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ అవసరమున్న ప్రతివ్యక్తికి సాయపడుతూ తమ దేశ భక్తిని చాటాలని పిలుపునిచ్చారు. నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నారు. సింధు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అహల్యాబాయి హల్కర్ అవార్డుతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment