ఈయన పేరు నారాయణప్ప నాయుడు. వృత్తి సినిమా థియేటర్ నిర్వహణ. కానీ అనాథలకు, అభాగ్యులకు 15 ఏళ్లుగా ఆర్థిక సాయం అందిస్తున్నారు.మదనపల్లె పట్టణ నడిబొడ్డున వున్న సీటీఎం రోడ్డులో నిర్మించిన ఏఎస్‌ఆర్ సినిమా థియేటర్ ఆవరణలో ఆంజనేయ స్వామి, సాయిబాబా విగ్రహాల ముందు ఓ హుండీని ఏర్పాటు చేశారు. సినిమా కోసం వచ్చే ప్రేక్షకులు ఆ హుండీలో వేసే డబ్బును ప్రత ఏటా అనాథ శరణాలయాలకు అందిస్తున్నారు. ఆయనతో ‘సాక్షి’ చిట్‌చాట్.
ప్ర: సేవ చేయాలని ఎందుకనుకున్నారు?
జ: ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తపన చిన్నప్పటి నుంచే ఉంది. ఏదో రకంగా నా వంతు సేవ చేయాలనుకున్నా.
ప్ర: ఎంత కాలం నుంచి చేస్తున్నారు
జ: సుమారు 15 ఏళ్లు దాటింది. హుండీనే కాదు. బర్మావీధిలో కూడా శ్రీసాయి మారుతీ సేవాట్రస్ట్‌ను ఏర్పాటు చేశాను. అక్కడ ప్రతి ఆది, గురు వారాలలో 100 మందికి అన్నదానం చేస్తా.
ప్ర: ఇంకేమి చేస్తారు?
జ: ఏటా పాఠశాలలు ప్రారంభం కాగానే గ్రామీణ ప్రాంతాల్లోని 100 మంది పేద విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేస్తాను.
ప్ర: ఇవన్నీ దేని కోసం?
జ: ఆత్మ సంతృప్తి కోసమే. ప్రచారం కోసం కాదు. నా వల్ల ఇంకెవరైనా స్ఫూర్తి పొందితే సమాజానికి మేలు కలుగుతుంది కదా!
ప్ర: ఇంకెంత కాలం చేస్తారు?
జ: నేను ఉన్నంత వరకూ సేవ చేస్తూనే ఉంటాను.
ప్ర: ఈ రోజు చెక్కులిస్తున్నారట?
జ: స్థానిక ఏఎస్‌ఆర్ థియేటర్ ఆవరణలో ఆదివారం రూ.1లక్ష చెక్కులు పంపిణీ చేస్తాం. పట్టణంలోని వెలుగు మానసిక వికలాంగుల పాఠశాల, స్రవంతి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్, చైతన్య అనాథ శరణాలయం వాల్మీకిపురంలోని చౌడేశ్వరి వృద్ధాశ్రమానికి రూ.25 వేల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తున్నాం.
అనాథలకు ఆసరాగా..
Published Sun, Mar 6 2016 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM
Advertisement
Advertisement