narayanappa
-
‘అనంత’ రైతుకు ‘కర్మ వీర చక్ర’ అవార్డు
సాక్షి, అమరావతి: అతనో సన్నకారు రైతు. కేవలం 30 సెంట్ల విస్తీర్ణంలో ఏడాది పొడవునా 20 రకాల పంటలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. అనంతపురం జిల్లా మల్లాపురానికి చెందిన ఎం.నారాయణప్ప చేసిన ప్రయోగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి, ఆర్ఈఎక్స్, కర్మ వీర్ గ్లోబల్ ఫెలోషిప్ భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఎన్జీఓస్ (ఐకాంగో) ఏటా అంతర్జాతీయ స్థాయిలో ఇచ్చే ‘కర్మవీర చక్ర’ పురస్కారం నారాయణప్పను వరించింది. గతంలో ఈ అవార్డును వ్యవసాయ రంగంలో విశిష్ట ఖ్యాతిగడించిన దివంగత శాస్తవేత్త ఎంఎస్ స్వామినాథన్, క్రీడారంగంలో రాహుల్ ద్రావిడ్, పుల్లెల గోపీచంద్, కళా రంగంలో కాజోల్ తదితరులకు అందజేశారు. ఇప్పుడు వీరి సరసన నారాయణప్ప చోటుదక్కించుకున్నారు. న్యూఢిల్లీలో సోమవారం జరిగే కార్యక్రమంలో ఈ అవార్డుతో పాటు ‘కర్మ వీర గ్లోబల్ ఫెలోషిప్’ (2023–24) కూడా అందిస్తారు. ఏడాది పొడవునా ఆదాయమే వ్యవసాయం కలిసి రాక కొంతకాలం భవన నిర్మాణ కార్మికునిగా పనిచేసిన నారాయణప్ప తిరిగి పొలం బాట పట్టాడు. తండ్రి నుంచి వచ్చిన 30 సెంట్ల భూమిలో రసాయన రహిత సాగుకు శ్రీకారం చుట్టాడు. అందరిలా ఏడాదికి రెండు పంటలతో సరిపెట్టకుండా ఏడాది పొడవునా పంట దిగుబడులొచ్చేలా ఎనీ టైం మనీ (ఏటీఎం) విధానానికి శ్రీకారం చుట్టాడు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 20 రకాలకు పైగా పంటలు పండిస్తూ కరువు నేలలో సిరుల పంట పండిస్తున్నారు. ఇంటికి సరిపడా పంట ఉంచుకుని మిగిలిన వాటిని మార్కెటింగ్ చేయడం ద్వారా సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ప్రతినెలా క్రమం తప్పకుండా ఆదాయం ఆర్జిస్తున్నాడు. కేవలం రూ.5 వేల పెట్టుబడితో ఏడాదికి రూ.2 లక్షల ఆదాయాన్ని రాబట్టి తక్కువ విస్తీర్ణంలో అధిక లాభాలు పొందవచ్చని రుజువు చేసి చూపించాడు. తాను ఆర్థికంగా ఎదగడంతోపాటు సమాజానికి సురక్షితమైన పౌష్టికాహారాన్ని అందిస్తూ.. తోటి రైతులకు కొత్త తరహా సాగు విధానాన్ని పరిచయం చేశాడు. గ్రామంలోనే తనతో పాటు మరో 25 మందికి ఏటీఎం మోడల్ సాగును నేర్పించాడు. వీరందరినీ చూసి పరిసర గ్రామాలకు చెందిన సుమారు 3,500 మంది రైతులు నారాయణప్ప బాటలో అడుగులేస్తూ సిరులు పండిస్తున్నారు. ఐకాంగోను ఆకట్టుకున్న ఏటీఎం నారాయణప్ప చేపట్టిన ఈ వినూత్న సాగు విధానం (ఎటీఎం) ఐకాంగోను ఆకర్షించింది. దీనిపై సుదీర్ఘకాలం పాటు అధ్యయనం చేసింది. ఈ వినూత్న విధానంలో మట్టి, భూమి ఆరోగ్యంగా మారడంతోపాటు భూమి మెత్తబడి ఆకు, కాండం ఆరోగ్యంగా ఉంటున్నాయి. ఏటీఎం మోడల్లో సాగు చేయడం ద్వారా వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని ‘క్త్లెమేట్ ఛేంజ్’ సాధ్యమవుతోందని గుర్తించారు. ఏటీఎం మోడల్‌ను ప్రపంచంలోనే ఏ గ్రేడ్ మోడల్‌గా గుర్తించడంతోపాటు ఏడాది పొడవునా పంటలు పండించడం ద్వారా అత్యధిక లాభాలను ఆర్జించడంతో పాటు నేలల్లో కర్బన స్థిరీకరణకు దోహదపడేలా కృషి చేస్తూ నారాయణప్ప రైతుల పాలిట ‘ఛేంజ్ ఏజెంట్’ నిలిచారని పేర్కొంటూ ఆయనను 2023–24 సంవత్సరానికి ‘కర్మ వీర్ చక్ర’ అవార్డుకు ఎంపిక చేశారు. గర్వంగా ఉంది మార్పు అనేది మనతోనే మొదలవ్వాలన్నది నా ఆలోచన. వ్యవసాయంలో ఏడాది పొడవునా ఆదాయం ఎందుకు రాదన్న ఆలోచన నుంచి పుట్టిందే ఏటీఎం మోడల్. రైతు సాధికార సంస్థ వెన్ను తట్టి ప్రోత్సహించింది. ఫలితంగా తక్కువ పెట్టుబడితో ఏడాది పొడవునా ఆదాయం ఆర్జిస్తున్నాను. పట్టుదల, నిరంతర శ్రమతో తగిన ప్రతిఫలం పొందుతున్నా. నేను చేస్తున్న సాగు విధానానికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం గర్వంగా ఉంది. – ఎం.నారాయణప్ప, మల్లాపురం, అనంతపురం జిల్లా -
రోడ్డు ప్రమాదంలో వెలుగు సీసీ మృతి
గుడిబండ (మడకశిర) : గుడిబండ మండలం ఎన్.ఆర్.రొప్పం గ్రామానికి చెందిన వెలుగు సీసీ నారాయణప్ప(45) గుంటూరులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు బంధువులు తెలిపారు. ఆయన గుంటూరు జిల్లాలోనే విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవ నిర్మాణ దీక్షలో పాల్గొనేందుకు విజయవాడ వెళ్తూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారని వారు కన్నీరుమున్నీరయ్యారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
అనాథలకు ఆసరాగా..
ఈయన పేరు నారాయణప్ప నాయుడు. వృత్తి సినిమా థియేటర్ నిర్వహణ. కానీ అనాథలకు, అభాగ్యులకు 15 ఏళ్లుగా ఆర్థిక సాయం అందిస్తున్నారు.మదనపల్లె పట్టణ నడిబొడ్డున వున్న సీటీఎం రోడ్డులో నిర్మించిన ఏఎస్ఆర్ సినిమా థియేటర్ ఆవరణలో ఆంజనేయ స్వామి, సాయిబాబా విగ్రహాల ముందు ఓ హుండీని ఏర్పాటు చేశారు. సినిమా కోసం వచ్చే ప్రేక్షకులు ఆ హుండీలో వేసే డబ్బును ప్రత ఏటా అనాథ శరణాలయాలకు అందిస్తున్నారు. ఆయనతో ‘సాక్షి’ చిట్‌చాట్. ప్ర: సేవ చేయాలని ఎందుకనుకున్నారు? జ: ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న తపన చిన్నప్పటి నుంచే ఉంది. ఏదో రకంగా నా వంతు సేవ చేయాలనుకున్నా. ప్ర: ఎంత కాలం నుంచి చేస్తున్నారు జ: సుమారు 15 ఏళ్లు దాటింది. హుండీనే కాదు. బర్మావీధిలో కూడా శ్రీసాయి మారుతీ సేవాట్రస్ట్ను ఏర్పాటు చేశాను. అక్కడ ప్రతి ఆది, గురు వారాలలో 100 మందికి అన్నదానం చేస్తా. ప్ర: ఇంకేమి చేస్తారు? జ: ఏటా పాఠశాలలు ప్రారంభం కాగానే గ్రామీణ ప్రాంతాల్లోని 100 మంది పేద విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేస్తాను. ప్ర: ఇవన్నీ దేని కోసం? జ: ఆత్మ సంతృప్తి కోసమే. ప్రచారం కోసం కాదు. నా వల్ల ఇంకెవరైనా స్ఫూర్తి పొందితే సమాజానికి మేలు కలుగుతుంది కదా! ప్ర: ఇంకెంత కాలం చేస్తారు? జ: నేను ఉన్నంత వరకూ సేవ చేస్తూనే ఉంటాను. ప్ర: ఈ రోజు చెక్కులిస్తున్నారట? జ: స్థానిక ఏఎస్ఆర్ థియేటర్ ఆవరణలో ఆదివారం రూ.1లక్ష చెక్కులు పంపిణీ చేస్తాం. పట్టణంలోని వెలుగు మానసిక వికలాంగుల పాఠశాల, స్రవంతి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్, చైతన్య అనాథ శరణాలయం వాల్మీకిపురంలోని చౌడేశ్వరి వృద్ధాశ్రమానికి రూ.25 వేల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తున్నాం. -
పింఛన్ కోసం వచ్చి...
అనంతపురం : పింఛన్ కోసం వచ్చిన ఓ వృద్ధుడు, పింఛన్ తీసుకోకుండానే మృతి చెందాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా శింగనమల మండలం బండమీదిపల్లి ఎలిమెంటరీ పాఠశాల్లో చోటు చేసుకుంది. వివరాలు.. బండమీదిపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప (75) అవివాహితుడు. దాంతో ఉప్పర్‌పల్లి గ్రామంలోని బంధువుల ఇంటిలో నివసిస్తున్నాడు. అతడికి పింఛన్ మంజూరైందని సమాచారం అందుకున్నాడు. ఆ క్రమంలో బుధవారం బండమీదిపల్లి గ్రామానికి వచ్చాడు. రిజిస్టర్లో నారాయణప్ప చేతి వేలిముద్రలు పడకపోవడంతో అధికారులు గురువారం రమ్మని చెప్పారు. దాంతో నారాయణప్ప బుధవారం రాత్రి అదే పాఠశాలలో నిద్రపోయాడు. గురువారం ఉదయం పాఠశాల వద్దకు వచ్చిన అధికారులు నారాయణప్ప పాఠశాల నేలపై పడి ఉన్నాడు. అతన్ని లేపేందుకు ప్రయత్నించగా... నారాయణప్ప లేవలేదు. దీంతో అధికారులు స్థానిక వైద్యుడిని తీసుకు వచ్చి నారాయణప్పను పరీక్షించారు. అతడు మరణించినట్లు వైద్యులు చెప్పారు. నారాయణప్ప బంధువులకు ఈ విషయాన్ని గ్రామస్తులు తెలిపారు. -
ఏనుగుల బీభత్సం
గుడుపల్లె, న్యూస్‌లైన్: మండలంలోని అటవీ సమీప గ్రా మాల్లో శనివారం రాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలను తొక్కి సర్వనాశనం చేశాయి. బోరు పైపులను ధ్వంసం చేశాయి. గ్రామాల మీదకొచ్చి ప్రాణాలు తీస్తాయేమోనని పలువురు భయాందోళనకు గురవుతున్నారు. 20 రోజులుగా మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో 24 ఏనుగులు తిష్టవేశాయి. అందులో 15 ఏనుగులు ఓ గ్రూపుగా విడిపోయి కర్ణాటక రాష్ర్టం లోని అటవీ ప్రాంతాలకు వెళ్లిపోయాయి. మిగిలిన ఏనుగులు అక్కడే ఉంటూ అడపాదడపా సమీప గ్రామాల మీదకు దూసుకొస్తున్నాయి. రాత్రి పూట పంట పొలాలను తొక్కి నాశనం చేస్తున్నాయి. శనివారం రాత్రి అటవీ సమీప గ్రామాలైన కోడిగానిపల్లె నుంచి వూలవానికొత్తూరు వరకు సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేశాయి. అయ్యువార్లగొల్లపల్లె సమీపంలోకి రావడంతో కుక్కలు అడ్డుపడ్డాయి. ఓ కుక్కపిల్ల ను తొక్కి చంపేశాయి. అక్కడి నుంచి వూలవానికొత్తూరుకు చేరుకుని రైతు నారాయుణప్ప రాగికుప్పలను ఆరగించాయి. తిమ్మయ్యకు చెందిన బోరు పైపులు, కేసింగ్ పైపు, డ్రిప్ పరికరాలను ధ్వంసం చేశాయి. పక్కనే ఉన్న టమాట పంటనూ తొక్కి నాశనం చేశాయి. *2 లక్షల మేర నష్టం వాటిల్లినట్టు రైతు ఆవేదన చెందాడు. బోరులో రాళ్లు పడి ఉంటే మోటారు పనిచేయదని వాపోయాడు. విషయం తెలుసుకున్న కుప్పం అటవీశాఖ ఎఫ్ఆర్వో రెడ్డెప్ప, డీఆర్వో వెంకటరవుణ ధ్వంసమైన పంటలు, బోరును పరిశీలించారు. నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.