అనాథలుగా అనంతలోకాలకు..
Published Fri, May 26 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM
వేర్వేరు చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గురు మృతి
కర్నూలు: కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు వెనుక రామయ్య ఐఐటీ కాలేజీ సమీపంలో సుమారు 35 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. సుమారు 5.5 అడుగుల ఎత్తు, నలుపు రంగు ఉంటాడు. బ్లాక్ ప్యాంటు ధరించాడు. ఆర్టీసీ బస్టాండ్ ఔట్‌వే దగ్గర వ్యాపార దుకాణం ముందు సుమారు 55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతిచెందాడు. నలుపు, బ్లూ రంగులు గల షర్టు, బ్లూ డ్రాయర్ ధరించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నాల్గవ పట్టణ పోలీసులు ఆయా ప్రాంతాలకు వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో వడదెబ్బతో మృతిచెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆచూకీ తెలిసినవారు 94406 27736, 08518–259462కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ నాగరాజరావు కోరారు.
Advertisement
Advertisement