అనాథలకు ‘ఓబీసీ’ రిజర్వేషన్
న్యూఢిల్లీ: జనరల్ కేటగిరీకి చెందిన అనాథ పిల్లలు ఇకపై ఓబీసీ కేటగిరీతోపాటు 27 శాతం రిజర్వేషన్ పొందనున్నారు. ఈ మేరకు వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్(ఎన్‌సీబీసీ) గతవారం తీర్మానం చేసింది. ఈ తీర్మానం ప్రకారం తల్లిదండ్రులను కోల్పోయిన పదేళ్లలోపు పిల్లలు ఓబీసీ జాబితాలో స్థానం పొందుతారు. తద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఉద్యోగాల్లో ఓబీసీ కోటా కింద రిజర్వేషన్ లభిస్తుంది. తీర్మానం ప్రతిని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు పంపించినట్లు ఎన్‌సీబీసీ సభ్యుడు అశోక్ సైని తెలిపారు. ఎన్‌సీబీసీ ప్రతిపాదనలు అన్ని ప్రధాన పార్టీలు పరిగణనలోకి తీసుకున్నట్లు..
ఇక కేబినెట్ ఆమోదం మాత్రమే మిగిలి ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇదే తరహాలో హిజ్రాలకు ఓబీసీలో 27 శాతం కోటా అమలు చేయాలని ఎన్‌సీబీసీ ప్రతిపాదించగా ఓబీసీ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో కేంద్రం దానిని నిలుపుదల చేసింది.