Mona motvani
-
అది మరిచిపోలేని క్షణం.. హన్సిక తల్లి ఎమోషనల్
హీరోయిన్ హన్సిక మోత్వాని వివాహం ఆదివారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో హన్సిక మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. జైపూర్‌లోని ముండోతా కోట వీరి పెళ్లికి వేదికగా నిలిచింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. తాజాగా కూతురి వివాహంపై హన్సిక తల్లి ఎమోషనల్ అయ్యారు. (ఇది చదవండి: ఘనంగా హీరోయిన్ హన్సిక వివాహం... స్పెషల్ గెస్టులు ఎవరో తెలిస్తే షాక్!) హన్సిక తల్లి మోనా మాట్లాడుతూ.. 'నేను అదృష్టవంతురాలిని. హన్సికను చూసి సంతోషంతో పొంగిపోయా. ఏ తల్లిదండ్రులకైనా బిడ్డ సంతోషంగా వివాహం చేసుకోవడమే మరిచిపోలేని క్షణం. సరైన సమయంలో మంచి వరుడు దొరికాడు. నేను చెప్పాల్సింది ఒక్కటే. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. హన్సిక తనకిష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అదృష్టంగా భావించాం. ఇంత మంచి కుటుంబం దొరకడం కూడా మన అదృష్టం. మంచి మనిషిగా ఉండటం చాలా ముఖ్యం.' అంటూ ఎమోషనల్ అయ్యారు. పెళ్లి తర్వాత హన్సిక ప్లాన్‌పై ఆమె మాట్లాడారు. హన్సిక హాట్‌స్టార్ కోసం ఏడు సినిమాలు, రెండు వెబ్ షోలు ఉన్నాయి. పెళ్లి తర్వాత కూడా ఆమె మునుపటిలానే బిజీగా ఉండబోతోందని మోనా వివరించింది. -
నచ్చిన కానుక
బహుమతులు ఎవరికి ఇష్టం ఉండవు? సందర్భం ఉన్నా లేకున్నా బహుమతులు అందుకోవడం అందరికీ ఇష్టమే. నచ్చిన వస్తువే బహుమతిగా వస్తే? ఆ ఆనందమే వేరు. దీపావళికి తనకు నచ్చిన కారును బహుమతిగా పొందారు హన్సిక. దీపావళి కానుకగా హన్సిక తల్లి మోనా మొత్వాని రోల్స్ రాయిస్ కార్‌ను కుమార్తెకు గిఫ్ట్‌గా అందించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకున్నారు హన్సిక. ఈ కారు ఖరీదు సుమారు 6 కోట్లు పైనే ఉంటుందని సమాచారం. కొత్త కారు పొందిన ఆనందాన్ని వీడియో రూపంలో షేర్ చేశారామె. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా, తమిళంలో రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌తో బిజీ బిజీగా ఉన్నారు హన్సిక. -
మా అమ్మయి చాలా యంగ్
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే పాటను యువత ఇప్పటికీ మరిచిపోదు. పోకిరి చిత్రంలో ముమైత్‌ఖాన్ నర్తించిన ఆ పాట యూత్‌కి ఎప్పటికీ కిక్కే. ఆ విషయం మాకు తెలుసు.. ఇంతకీ మీరు చెప్పొచ్చేదేమిటంటారా? నటి హన్సిక అమ్మ మాటలు చూస్తే ముమైత్‌ఖాన్ పాట గుర్తుకొచ్చిందిలెండి. చాలా మంది హీరోయిన్ల తల్లుల మాదిరిగానే హన్సిక తల్లి మోనా మోత్వాని తన కూతురి వయసు గురించి మాట్లాడారు. మా అమ్మాయి చాలా యంగ్. ఈ మధ్యే 24 ఏళ్లు పూర్తి అయ్యాయి. అసత్య ప్రచారాలు చేయకండి అని కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. హన్సిక తల్లికి అంత కోపం ఎందుకొచ్చిందో ఈ పాటికే అర్థమై ఉంటుంది. విషయం ఏమిటంటే అందాల భామ హన్సిక పెళ్లికి రెడీ అవుతున్నారనని, మోనా మోత్వాని ఆమెకు వరుడిని వెతికే పనిలో ముమ్మరంగా ఉన్నారనే ప్రచారం సోషల్‌మీడియా హోరెత్తిస్తోంది. అందుకు కారణాలు లేకపోలేదు. హన్సికకు కోలీవుడ్‌లో ఒక్క చిత్రం కూడా చేతిలో లేదు. జయంరవితో నటించిన ఒక చిత్రం భోగన్ త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కొత్తగా అవకాశాలు లేవు. ఇక చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్లో లక్కున్నోడు అనే ఒక్క చిత్రంలో నటిస్తున్నారు. అయితే హన్సిక కొత్త చిత్రాలను అంగీకరించడం లేదని, పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. హన్సిక నటించిన చివరి చిత్రం మనిధన్. ఆ తరువాత మరో చిత్రం తెరపైకి రాలేదు. భోగన్ తరువాత ఇంకో చిత్రం లేదు. ఇలాంటి కూడికలు తీసివేతలు లెక్క కట్టే.. హన్సిక పెళ్లికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక పోతే మా అమ్మాయి చాలా యంగ్ అని హన్సిక తల్లి మోనా అనడంలోనూ తప్పులేదు. ఎందుకంటే మూడున్నర పదులు దాటిన నాయికలు ఇంకా పెళ్లికి తొందరేముంది అంటుంటే 24 ఏళ్ల హన్సికకు అప్పుడే పెళ్లి ఆలోచనేమిటన్నది ఆమె తల్లి భావనై ఉండవచ్చు.