షూటింగ్‌లో గాయపడ్డ హన్సిక | Hansika Got Hurt in Maha Movie Shooting | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 24 2019 10:03 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Hansika Got Hurt in Maha Movie Shooting - Sakshi

ఇటీవల కోలీవుడ్ లో తరుచూ వార్తల్లో కనిపిస్తున్న హీరోయిన్‌ హన్సిక. ప్రస్తుతం మహా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న హన్సికకు గాయమైనట్టుగా తెలుస్తోంది. యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా జారిపడిన హన్సిక చేతికి గాయమైంది. అయితే ఆ గాయం తీవ్రమైనది కాకపోవటంతో రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచించారు.

తన 50వ చిత్రంగా తెరకెక్కుతున్న మహా సినిమా పనుల్లో బిజీగా ఉన్న హన్సికను పలు వివాదాలు చుట్టు ముట్టాయి. ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రిలీజ్‌ చేసిన పోస్టర్స్‌ హన్సికను కష్టాల్లో పడేశాయి. హన్సిక మాత్రం అవేవి పట్టించుకోకుండా షూటింగ్ పనులు కానిచ్చేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement