మాజీ ప్రియుడితో హన్సిక | Simbu to Play Extended Cameo in Hansika Maha | Sakshi
Sakshi News home page

మాజీ ప్రియుడితో హన్సిక

Published Wed, Mar 6 2019 10:21 AM | Last Updated on Wed, Mar 6 2019 10:21 AM

Simbu to Play Extended Cameo in Hansika Maha - Sakshi

తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన హన్సిక తరువాత కోలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు తరుచూ వివాదాలతోనూ వార్తల్లో కనిపించే ఈ బ్యూటీ తాజా మరోసారి ఆసక్తికర వార్తలో హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ప్రస్తుతం హన్సిక తన 50వ చిత్రంగా నటిస్తున్న మహా సినిమా కూడా తరుచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది.

తాజా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ను ప్రకటించారు. ఈ సినిమాలో హన్సిక మాజీ ప్రియుడు కోలీవుడ్ స్టార్ హీరో శింబు అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని హన్సిక స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘న్యూస్‌ అనుకున్న సమయం కన్నా ముందే లీకైంది. నేను, శింబు ‘మహా’లో కలిసి నటిస్తున్నాం’ అంటూ ట్వీట్ చేసింది హన్సిక. ఇప్పటికే పోస్టర్ల వివాదంతో మంచి పబ్లిసిటీ సాధించిన ఈ సినిమా ఇప్పుడు శింబు, హన్సికల క్రేజీ కాంబినేషన్‌తో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement