శృంగారం కోసం.. భార్యపైకి బొద్దింకలు | Bengaluru woman says husband used cockroaches to harass her | Sakshi
Sakshi News home page

శృంగారం కోసం.. భార్యపైకి బొద్దింకలు

Published Fri, Jan 20 2017 3:04 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM

శృంగారం కోసం.. భార్యపైకి బొద్దింకలు

శృంగారం కోసం.. భార్యపైకి బొద్దింకలు

బెంగళూరులో ఐటీ ఇంజనీర్‌ వికృత చేష్టలు

సాక్షి, బెంగళూరు: శృంగారానికి తనను దగ్గరికి రానివ్వడం లేదని భార్యపై పైశాచికంగా ప్రవర్తించాడో ప్రబుద్ధ ఐటీ ఇంజనీర్‌. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని బన్నేరుఘట్టలో ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఇంజనీరైన అవినాశ్‌ శర్మ పదేళ్ల క్రితం తన క్లాస్‌మేట్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఇంజనీర్‌.

అవినాశ్‌ కొద్దికాలంగా మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అవినాశ్‌ ప్రవర్తన నచ్చక ఆమె దగ్గరకు రానివ్వడం లేదు. దీంతో ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలనుకున్న అవినాశ్‌ తన భార్యపై బొద్దింకలను వదులుతూ భయపెట్టేవాడు. తనతో శృంగారంలో పాల్గొనకుంటే ఇంతేనని వేధించడం ప్రారంభించాడు.

మొదట్లో తమ ఇద్దరు పిల్లల బాగు కోసం భర్త వేధింపులను ఓర్చుకున్న ఆమె రోజురోజుకూ వేధింపులు తీవ్రం కావడం తో పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పోలీసులు కేసును మహిళా సహాయ వాణికి బదిలీ చేశారు. నిందతుణ్ని పిలిపించి విచారించగా శృంగారం లో తనకు సహకరించకపోవడం తోనే బొద్దింకలు వదులుతూ వేధించినట్లు చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement