బెంగళూరు: బెంగళూరులో యువతిని కిడ్నాప్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి పేరు అక్షయ్ అని సీనియర్ పోలీస్ అధికారి లోకేష్ కుమార్ చెప్పారు. గత నెల 23న రాత్రి 10 గంటల సమయంలో బెంగళూరు దక్షిణప్రాంతంలో ఇంటిముందు నిల్చుని ఫోన్లో మాట్లాడుతున్న యువతిని (22).. అందరూ చూస్తుండగానే దుండగుడు బలవంతంగా ఎత్తుకెళ్లాడు. సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యాలు వెలుగుచూడటంతో బెంగళూరులో కలకలం సృష్టించింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితుడిని అరెస్ట్ చేయాలని కోరింది.
ఈ ఘటన గురించి బాధితురాలు మాట్లాడుతూ.. నిందితుడు బలవంతంగా తనను నిర్మాణంలో ఉన్న సైట్ దగ్గరకు తీసుకెళ్లాడని, తనను అత్యాచారం చేయడానికి కిడ్నాప్ చేశాడని చెప్పింది. 'రక్షించమని నేను గట్టిగా అరిచాను. అతను నా నోరు మూసేందుకు ప్రయత్నించాడు. నన్ను కాపాడుకునేందుకు అతణ్ని కొరకగా, అతను నన్ను కొట్టాడు. భయంతో నేను అపస్మారకస్థితిలోకి వెళ్లాను. కాసేపటి తర్వాత మెళుకవలోని రాగా, అతను పారిపోయాడు. నా బ్యాగ్, పర్సు, ఫోన్ అక్కడే ఉన్నాయి. వాటిని తీసుకెళ్లలేదు. దీన్నిబట్టి అతను నన్ను రేప్ చేయడానికే కిడ్నాప్ చేశాడనిపిస్తోంది' అని బాధితురాలు చెప్పింది. ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత సోమవారం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను కోరింది.
నన్ను రేప్ చేయడానికి కిడ్నాప్ చేశాడు
Published Tue, May 3 2016 2:46 PM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM
Advertisement
Advertisement