కొత్తగూడెం : అనుమానాస్పదంగా వ్యక్తి మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని గంగాబస్తీలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గంగాబస్తీకి చెందిన పేరం బుచ్చిబాబు (30) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతను అనారోగ్యంతో ఈ రోజు మధ్యాహ్నం మృతిచెందాడు. విషయం తెలిసిన బంధువులు మృతదేహాన్ని చూడటానికి వచ్చారు.
ఈ సమయంలో అతని మెడ వెనుక భాగంలో తాడు గుర్తులు కనిపించడంతో భార్యే చంపి ఉంటుందని అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.