ఏడేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన నగరంలోని సింగరేణి కాలనీలో సంచలనం సృష్టించింది.
హైదరాబాద్: ఏడేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన నగరంలోని సింగరేణి కాలనీలో సంచలనం సృష్టించింది. కాలనీలో నివసించే గాయిత్రి(7).. ఆదివారం విగతజీవిగా కనిపించింది.
అయితే వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందన్న కారణంతో తల్లే చిన్నారిని చంపేసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి తల్లిని అదుపులోకి తసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.