లావేరు: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మూడు రోజుల కిందట వాటర్ ట్యాంకులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన రమ్య మృతిపై మిస్టరీ మూడు రోజులైనా వీడలేదు. రమ్యకు ఇంటి వద్దగానీ...కస్తూర్బాలోగానీ ఎటువంటి సమస్యలు లేవని ఇటు తల్లిదండ్రులు, అటు విద్యాలయం ప్రత్యేకాధికారి చెబుతున్నారు. ఏ కారణాలు లేకుండా రమ్య ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో రమ్య బాగా చదువుతుందని అందరూ చెబుతున్నారు. బాగా చదివే విద్యార్థినికి ఒకేసారి ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఈ వయసులో ఎందుకు కలిగిందన్నది అందరినీ తోలిచేస్తున్న ప్రశ్న. అయితే దసరా సెలవులకు ఇంటికెళ్లి వచ్చిన రమ్యలో కొంత మార్పు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పోలీసులు కూడా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఈ కేసు వారికి ఒక సవాల్‌గా మారింది.
పోస్టుమార్టం ఆధారంగా..
రమ్య ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు అంతుపట్టక పోవడంతో పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసును దర్యాప్తు చేసి కారణాలను కనుగొనడానికి పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. రమ్యకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా? లేకా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనేది పోస్టుమార్టం రిపోర్టులో తెలుస్తుందని, దాని ఆధారంగా కారణాలను తెలుసుకోవచ్చునని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 26న రమ్య పోస్టుమార్టం రిపోర్టు వస్తుందని అప్పుడు వరకూ వేచి చూసి అప్పుడు ఆత్మహత్య కారణాలుపై దర్యాప్తు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.
రమ్య ఆత్మహత్యపై వీడని మిస్టరీ
Published Mon, Oct 24 2016 12:29 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement