రమ్య(ఫైల్)
రామగిరి(మంథని): మూడురోజుల క్రితం తల్లితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన కూతురు మృతదేహం వ్యవసాయ బావిలో తేలిన సంఘటన రామగిరి మండలం బేగంపేటలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పెరుమాండ్ల రామస్వామి– దుర్గమ్మకు నలుగురు కూతుళ్లు, కొడుకు సంతానం. చిన్న కూతురు రమ్య(21) డిగ్రీ చదువుతోంది. అయితే రమ్య వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఎంతకీ తగ్గపోవడంతో ఆసుపత్రికి వెళ్దామని తల్లి దుర్గమ్మ చెప్పగా, తాను రానని గత శుక్రవారం తల్లితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సమీప బంధువుల ఇళ్లలో వెతికారు. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన తాళ్ల రాజయ్య ఆదివారం గ్రామ శివారులోని కుమ్మరికుంట సమీపంలో గల తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లగా బావి నుంచి దుర్వాసన రావడంతో పరిశీలించగా మృతదేహం కనిపించింది. విషయం గ్రామంలో ప్రచారం కావడంతో రామస్వామి–దుర్గమ్మ సంఘటన స్థలానికి చేరుకుని తమ కూతురు మృతదేహామేనని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.(ప్రేమ పెళ్లి.. అమ్మను కొట్టొద్దు నాన్నా.. )
రాయికల్‌లో..
రాయికల్(జగిత్యాల): రాయికల్ పట్టణంలోని ఒడ్డెరకాలనీకి చెందిన బోదాసు రజిత(40) ఆ దివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆరోగ్యం తెలిపారు. వివరాలిలా ఉ న్నాయి.. రజిత చిన్నప్పటి నుంచి మూర్చవ్యాధి తో బాధపడుతోంది. వివాహమై కూతురు పుట్టగానే విడాకులయ్యాయి. ఈక్రమంలో అ నారోగ్యంతో మనస్తాపం చెంది ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి వెంకవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment