
బావతో పెళ్లి ఇష్టం లేక..
మేనబావతో పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలం నాగాపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమ్య(22) ఇంటర్ వరకు చదువుకొని ఇంటి వద్దే ఉంటోంది.
ఈ క్రమంలో తల్లిదండ్రులు ఆమెకు మేనబావతో వివాహం జరపడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.