No Rain Village: Mysterious Village Where Never Rain Till Now Pictures Surprise Us - Sakshi
Sakshi News home page

ఇంత వరకు వర్షం కురవని వింత గ్రామం.. ఎక్కడో తెలుసా!

Published Mon, Jul 5 2021 9:46 PM | Last Updated on Wed, Jul 7 2021 12:31 PM

Mysterious Village Where Never Rain Till Now Pictures Surprise Us - Sakshi

పుడమి అంటే అద్భుతాలకు పుట్టిల్లు. ఈ ప్రపంచంలో మనకి తెలియని ఎన్నో వింతలు.. మరెన్నో విచిత్రాలు దాగున్నాయి. భూమిపై ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా వర్షం కురుస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు. కానీ, ఓ గ్రామంలో మాత్రం ఇప్పటి వరకు వర్షం కురవలేదంటే నమ్మగలరా? ఇదేంటి వింత అనుకుంటున్నారా ! అలాంటి ఓ వింత ప్రదేశాం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

వివరాల్లోకి వెళితే.. ప్రపంచంలో అత్యధిక వర్షాలు మేఘాలయలోని మాసిన్రామ్ గ్రామంలో కురుస్తుందని తెలిసిన విషయమే కానీ అసలు వర్షం కురవని గ్రామం కూడా ఉందట. ఆ గ్రామం పేరు ‘అల్-హుతైబ్’.  ఇది యెమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంటుంది. కాగా ఈ గ్రామం భూమికి 3200 మీటర్ల ఎత్తులో ఉన్న ఓ కొండపై ఉంది.

దీని ప్రకారం మేఘాల కంటే ఎత్తులో ఆ గ్రామం ఉన్నదన్న మాట. మేఘాల కంటే ఎత్తులో ఉండటం వలన ఈ ప్రాంతంలో వర్షాలు కురవడం లేదు. అక్కడ వాతావరణ విషయానికొస్తే ఉదయం పూట ఎండ, రాత్రి సమయం చలిగా ఉంటుంది. అక్కడ నివసిస్తున్న ప్రజలకు కూడా ఆ వాతావరణం అలవాటే. కాగా ఆ వింత ప్రాంతాన్ని చూసేందుకు టూరిస్టులు తాకిడి బాగానే ఉంటుందట.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement